ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ll ఉజ్వల యోజన పథకం వెంటనే అప్లై చేసుకోండి ll కావలిసిన పత్రాలు ఇవే…

ఉజ్వల యోజన పథకం:

  • ఈ పథకం కింద ఎవరైతే తెల్ల రేషన్ కార్డు వుండి పేద కుటుంబాల వారు ఉంటారో వారికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందివ్వడం కొరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఉజ్వల యోజన స్కీం ను 2016 వ ఏడాదిలో ఈ పథకం ను ప్రారంబించడం జరిగింది.ఈ పథకం లో భాగం గా అర్హులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ తో పాటు 550రూ లకు గ్యాస్ సిలిండర్ ఇస్తారు.ఇప్పటికే ఈ పథకం కింద చాలా మంది లబ్ది పొందారు.ఈ పథకంను మీరు అప్లై చేస్కోవాలి అంటే రెండు విధాలుగా చేస్కోవచ్చు.ఒకటి మీకు దగర్లో వుండే గ్యాస్ ఏజెన్సీ ద్వార అప్లై చేస్కోవచ్చు.లేదా మిరే సొంతంగా ఈ స్కీం యొక్క అధికారిక వెబ్సైటు లో అప్లై చేస్కోవచ్చు.కావున ఈ స్కీం కి ఎలా అప్లై చెయ్యాలి ఎవరు అర్హులు అనే పూర్తి వివరాలను కింద వివరంగా తెలియజేయడం జరిగింది.చూసి అప్లై చేసుకోండి.

ఈ పథకంతో కలిగే లాభాలు:

  • ఈ స్కీం ద్వార ఉచితంగా గ్యాస్ కనెక్షన్ లబిస్తుంది.
  • అలాగే LPG గ్యాస్ కనెక్షన్తో పాటుగా తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ ఇస్తారు.
  • కొత్త కనెక్షన్ పెట్టినపుడు తొలి గ్యాస్ సిలిండర్ ఉచితంగా లబిస్తుంది.
  • న్యూ కనెక్షన్ సమయంలో 14.2 కేజీల సిలిండర్ కు రూ.2200/- వరకు ఆర్థిక సహాయం లబిస్తుంది.
  • ఇది పేద కుటుంభాలకు ఒక వరంలాంటి పథకం.

ఉజ్వల యోజన కనెక్షన్ కొరకు e-KYC కచ్చితంగా వుండాలి:

  • ఉజ్వల యోజన పథకంలో కొత్త గ్యాస్ కనెక్షన్ కొరకు e-kyc తప్పనిసారిగా చేయించుకోవాలి.
  • దీని కొరకు బ్యాంకు ఖాతా వివరాలు అవసరం అవుతాయి.మరిన్ని వివరాలకు మీ దగ్గరలో వుండే గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ లో కలవండి.

ఉండాల్సిన అర్హతలు ఏంటి?

  • ఈ పథకం లో మహిళలకు మాత్రమే అర్హత వుంటుంది.
  • ఇండియన్ అయ్యి వుండాలి.
  • అలాగే మహిళకు వివాహం అయ్యి రేషన్ కార్డు తప్పని సారిగా వుండాలి.
  • ఈ పథకం పేద కుటుంబాలకు మాత్రమే.
  • మహిళా వయసు 18 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వుండాలి.
  • SC,ST కులాల వారికి ఈ పథకం వర్తిస్తుంది.
  • మీ రేషన్ కార్డు లో వుండే ఫ్యామిలీ మెంబెర్స్ లో ఎవరికి కూడా గతంలో గ్యాస్ కనెక్షన్ ఉండకుడదు.

ఉజ్వల యోజనకు కావలిసిన పత్రాలు:

  • లబ్దిదారు యొక్క ఆధర్ కార్డు
  • అలాగే తెల్ల రేషన్ కార్డు
  • పాస్పోర్ట్ సైజు ఫోటోలు వుండాలి.
  • అదే విధంగా కుల ద్రువికరణ పత్రాలు వుండాలి.
  • అలాగే తప్పనిసరిగా మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ వుండాలి.

ఉజ్వల యోజన పథకంకు ఆన్లైన్ లో అప్లై చేయు పూర్తి విధానం:

  • ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకొని ఈ ఉజ్వల యోజన పథకం యొక్క అధికారిక వెబ్సైటు (Click Here) ఓపెన్ చేసుకోండి.
  • వెబ్సైటు ఓపెన్ చేశాక అందులో ఉజ్వల యోజన కనెక్షన్ (Ujjwala Beneficiary Connection) ఆప్షన్ మిద క్లిక్ చేసుకోండి.

ujjwala scheme apply online

 

  • తదుపరి మీరు ఏ గ్యాస్ ఏజెన్సీ ద్వార ఈ పథకం లో కొత్త గ్యాస్ కనెక్షన్ తీస్కోవాలి అనుకుంటునారో అందులో మనకు Indian, Bharat, Hp అనే కంపెనీస్ వుంటాయి.అందులో ఒక ఆప్షన్ క్లిక్ చేసుకోండి.
  • ఆ తర్వాత పేజిలో e-kyc పూర్తి చేయమని చూపిస్తుంది.అక్కడ మీ ఆధర్ నెంబర్ ను ఎంటర్ చేసి Generate Otp ఆప్షన్ క్లిక్ చేసుకోండి
  • ఆ తర్వాత మీ ఆధర్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి Otp వస్తుంది అది అక్కడ ఎంటర్ చేసి అలాగే Captcha ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి.
  • ఆ తర్వాత మీ ఫోటో తో పాటు మీ ఆధర్ వివరాలు డిస్ప్లే అవుతాయి
  • ఆ తర్వాత మీరు ఎంచుకున్న గ్యాస్ ఏజెన్సీ కొరకు రిజిస్ట్రేషన్ చెయ్యాలి.అందులో మీ పూర్తి పేరు అలాగే
  • మొబైల్ నెంబర్, ఈమెయిలు ఐడి వివరాలను నమోదు చేసి రిజిస్టర్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి ముందు
  • రిజిస్ట్రేషన్ అయ్యాక మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ తో లాగ్ ఇన్ అవ్వండి.
  • తదుపరి పేజిలో మీ జిల్లా,స్టేట్ మరియు మీ అడ్రస్ పిన్ కోడ్ నమోదు చేసుకోండి.e-kyc ప్రక్రియ పూర్తి చేసుకోండి.
  • ఆ తర్వాత మీ కుటుంబం యొక్క రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు వివరాలను నమోదు చేసుకోండి.
  • అలాగే మీకు ఏ సిలిండర్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
  • ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలు (Bank Account Number, IFSC Code, Bank Branch) ఆక్కడ నమోదు చేసుకోండి.
  • తదుపరి పేజిలో LPG కనెక్షన్ డీటెయిల్స్ వస్తాయి అందులో కనెక్షన్ సిలిండర్ టైపు సెలెక్ట్ చేసుకోండి.
  • ఆ తర్వాత పేజిలో అడ్రస్ కి సంబదించిన అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చెయ్యాల్సి వుంటుంది.మీ రేషన్ కార్డు ను అక్కడ అప్లోడ్ చెయ్యండి.
  • తదుపరి పేజిలో మీ రేషన్ కార్డు లో వున్నా అందరి వివరాలు అంటే (Applicant Relation Name, Aadhar Number, Date of birth, Gender) వివరాలు ఎంటర్ చేసుకోండి.
  • ఇక ఫైనల్ గా Declaration Option క్లిక్ చేసి Submit నొక్కండి.
  • ఇలా మీరు ప్రాసెస్ కంప్లీట్ చేశాక మీకు ఒక రెఫరెన్సు నెంబర్ జేనరేట్ అవుతుంది దాన్ని సేవ్ చేసుకొని అప్లికేషను ప్రింట్ తీస్కోండి.
  • ఆ తర్వాత మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫారం మరియు మీ యొక్క రేషన్ కార్డు లో వుండే అందరి ఆదార్ కార్డ్స్ ,రేషన్ కార్డు అలాగే మిగిలిన డాకుమెంట్స్ తీసుకోని మీరూ ఎంచుకున్న గ్యాస్ ఏజెన్సీలో ఇవ్వండి.

అప్లికేషన్ స్థితి (Application Status) ఎలా చెక్ చెయ్యాలి?

  • ఉజ్వల వెబ్సైటు లోనే మనకు ఈ స్కీం స్టేటస్ కొరకు ఆప్షన్ వుంటుంది ఆక్కడ క్లిక్ చేసుకోండి.
  • తదుపరి అక్కడ Connection Type లో Ujjwala ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత కింద మీరు ఈ స్కీంకి అప్లై చేసినపుడు మీకు వచ్చిన రిఫరెన్స్ నెంబర్ అలాగే పుట్టిన తేది ఎంటర్ చేసి Check Status ఆప్షన్ క్లిక్ చేస్తే
  • ఇందులో మీకు మీ అప్లికేషన్ ఎక్కడి దాకా వచ్చిందో అప్ప్రోవ్ అయ్యిందో లేదో చుస్కోవచ్చు.

ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేయు విధానం:

  • ఇంటర్నెట్ ద్వార ఉజ్వల యోజన అప్లికేషన్ ఫారం ప్రింట్ తీస్కోండి లేదా మీ దగ్గరలో వుండే మీసేవ సెంటర్లలో అప్లికేషను ఫోరమ్స్ దొరుకుతాయి.
  • ఆ దరఖస్తూ ఫారం లో మీ ఆధర్ మరియు రేషన్ కార్డు మీ బ్యాంకు వివరాలను జాగ్రత్హగా నింపండి.
  • ఇలా ఫిల్ చేశాక ఈ అప్లికేషన్ ఫారం అలాగే సంబంధిత పత్రాలను LPG గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ లో సబ్మిట్ చెయ్యండి.
  • ఆ తర్వాత ఈ పథకం కింద మీకు అర్హత వుంటే మీకు సిలిండర్ కనెక్షన్ ను కేట ఇస్తారు.

Note: మిత్రులారా మీకు ఈ ఉజ్వల యోజన పథకం సంబంధించి ఏవైనా సందేహాలు వుంటే కింద కామెంట్ బాక్స్ ద్వార తెలియజేయండి.

Read Also:

ముద్ర లోన్: 50 వేల నుంచి 10 లక్షల వరకు బ్యాంకు రుణాలు..వెంటనే అప్లై చేసుకోండి.అర్హతలివే

Author:

 

Web |  + posts

Ram Naik is the founder and content creator of Rammeesevatelugu.com. He is a Passionate content creator with over 4 years of experience, specializing in creating impactful and high quality content. He is a expertise in digital marketing, web designing and SEO strategies. He writes daily about online services, jobs notifications, and government schemes information in telugu. With a strong focus on public needs information. His ambition is to all types of useful information easily available to every reader in telugu

Leave a Comment