Train Ticket Booking Online:
-
రైల్వే ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ సులభంగా బుక్ చేసుకోడానికి అలాగే రైల్వే సంబంధించి అన్ని సేవలు పొందేలా రైల్వే డిపార్టుమెంట్ వారు కొత్త గా ఒక Railone అనే యాప్ ను తీసుకోని వచ్చారు.అందులో త్వరగా ట్రైన్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు.అలాగే ఇందులో ట్రైన్ కి సంబంధించి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.ఈ యాప్ రైల్వే ప్రయాణికులకు ఎంతో ఉపయోగాపడుతుంది కావున ఈ యాప్ ను ఎలా ఉపయోగించాలి అనే పూర్తి సమాచారం కింద వివరంగా తెలుసుకుందాం.
ఈ యాప్ లో వుండే రైల్వే సేవలు ఏంటి?
-
ఈ Railone యాప్ లో ట్రైన్ సంబదించి రిజర్వుడ్ మరియు అన్ రిజర్వు టికెట్స్ అలాగే ప్లాట్ ఫారం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
-
అలాగే ఈ యాప్ లో ట్రైన్ యొక్క లైవ్ ట్రాకింగ్ అలాగే PNR స్టేటస్,కోచ్ వివరాలు తెలుసుకోవచ్చు.
-
అదే విధంగా ట్రైన్ లో ఆహారం కూడా బుక్ చేసుకోవచ్చు.
-
ఈ యాప్ లో వ్యాలెట్ ఫీచర్ ద్వారా అందులో డబ్బు ఆడ్ చేసి సులభంగా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.అలాగే టికెట్ బుకింగ్ పై డిస్కౌంట్ లభిస్తుంది.
-
ఈ యాప్ ను వాడే విధానం చాలా సులభంగా వుంటుంది.
-
రైల్వే ఫిర్యాదులు కూడా చెయ్యవచ్చు.
-
IRCTC ID సెట్టింగ్ లేదా పాస్వర్డ్ అప్డేట్ ఫీచర్స్ కూడా వుంటాయి ఇందులో
-
ఈ యాప్ మనకు ప్లే స్టోర్ లో అందుబాటులో వుంది.
Note Points:
-
ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి అంటే మనకు IRCTC ID, Password వివరాలు తప్పకుండా వుండాలి.లేకపోతే ఈ యాప్ లోనే సెట్ చేసుకోవచ్చు.
-
వ్యక్తిగత IRCTC ID ద్వారా ట్రైన్ టికెట్స్ ఒక నెలలో లేదా ఒకేసారి 6 టికెట్స్ మాత్రమే బుక్ చెయ్యగలం.ఎక్కువ టికెట్స్ బుక్ చెయ్యాలి అంటే IRCTC Agent ఐడి వుండాలి.
-
ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాక మీ జర్నీ సమయం లో టికెట్ తో పాటు గుర్తింపు కార్డు అంటే ఆధార్ కార్డు తప్పకుండ వుండాలి.
ట్రైన్ టికెట్ బుకింగ్ కొరకు అవసరమయ్యే వివరాలు:
-
ప్రయాణికుడి యొక్క గుర్తింపు కార్డు అంటే ఆధార్ కార్డు లో వున్నా విధంగా పేరు వుండాలి.
-
ఆధార్ లో వున్నా వయసు,జెండర్ వివరాలు మరియు మొబైల్ నెంబర్,మెయిల్ ఐడి వివరాలు వుంటే చాలు బుక్ చేసుకోవచ్చు.
-
తత్కాల్ లో బుక్ చేసుకోవాలి అంటే ఆధార్ నెంబర్ వివరాలు అవసరం అవుతాయి.
-
IRCTC యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ వివరాలు వుండాలి.
ఈ Railone యాప్ లో ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి?
-
ముందుగా ఈ యాప్ కొరకు ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో Railone యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోండి( యాప్ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి)
-
యాప్ ఓపెన్ చేశాక అక్కడ మీకు New User Register ఆప్షన్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి.ఒకవేళ మీకు ముందే యాప్ రిజిస్టర్ వుంటే డైరెక్ట్ గా లాగ్ ఇన్ అవ్వండి.
-
మీరు అంతకు ముందే Rail కనెక్ట్ లో రిజిస్టర్ అయ్యింటే ఇందులో మీరు ఆ ఆప్షన్ క్లిక్ చేసి user ID ,పాస్వర్డ్ తో లాగ్ ఇన్ అవొచ్చు.పాస్వర్డ్ తెలికుంటే Forget చేసుకోవచ్చు.
-
యాప్ ఓపెన్ అయ్యాక అందులో కొన్ని ఆప్షన్స్ అలాగే సర్వీసెస్ లిస్టు అయితే వుంటాయి.
-
లాగ్ ఇన్ అయ్యాక కింద You అనే ఆప్షన్ క్లిక్ చేసి ప్రొఫైల్ లో మీ మెయిల్ ఐడి కూడా తప్పకుండా వెరిఫై చెయ్యాలి.
-
ఈ యాప్ లో స్లీపర్ క్లాసు ఎసి క్లాసు బుక్ చెయ్యాలి అంటే హోం పేజిలో Reserved ఆప్షన్ వుంటుంది.క్లిక్ చేసుకోండి.
-
తదుపరి మరొక పేజి ఓపెన్ అవుతుంది.అందులో మనం జర్నీ చెయ్యాలి అనుకుంటున్నా రూట్ ఎంపిక చేసుకోండి.
-
అలాగే ప్రయాణించే తేది మరియు క్లాసు, కోటా సెలెక్ట్ చేసుకోండి
-
కింద వుండే సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి.
-
ఆ తర్వాత పేజిలో మీరు ఎంచుకున్న రూట్ లో అందుబాటులో వున్నా ట్రైన్స్ లిస్టు చూపిస్తుంది.నచ్చిన ట్రైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
-
ట్రైన్ సెలెక్ట్ చేసుకున్నాక అందులో స్లీపర్ లేదా ఎసి క్లాసు బుక్ చెయ్యాలి అనుకుంటూన్నారో దాన్ని క్లిక్ చేసుకోండి.
-
ఆ తర్వాత పేజిలో మీ బోర్డింగ్ స్టేషన్ అలాగే కింద సెలెక్ట్ పాసెంజర్ దగ్గర ‘Add New’క్లిక్ చేసి,
-
అందులో ప్రయాణికుడి యొక్క గుర్తింపు కార్డు లో వుండే విధంగా ఆధార్ లో వుండే విధంగా పూర్తి పేరు,వయసు,జెండర్ మరియు బెర్త్ ప్రేఫరేన్సు సెలెక్ట్ చేసుకొని Add Passenger ఆప్షన్ క్లిక్ చేసేయండి.
-
అలాగే అందులో కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి చూపిస్తుంది.ఈ మెయిల్ ఐడి కే మనం బుక్ చేసే టికెట్ సెండ్ చెయ్యడం జరుగుతుంది.
-
డీటెయిల్స్ అన్ని పురించాక కింద నెక్స్ట్ ఆప్షన్ లోకి వెళ్ళండి.
-
తదుపరి పేజిలో పేమెంట్ పూర్తి చెయ్యండి.మీ యూపిఐ ద్వారా లేదా ఇందులోనే వ్యాలెట్ ద్వారా పేమెంట్ చెయ్యొచ్చు.
-
ఆ తర్వాత మీ యొక్క Ticket చూపిస్తుంది దాన్ని సేవ్ చేసుకొని జర్నీ చెయ్యండి.
గమనిక: మీకు ఏవైనా సందేహాలు లేదా ప్రశ్నలు వుంటే కింద కామెంట్ బాక్స్ లో తెలపండి.
Read Also:
ఆధార్ కొత్త ఆప్షన్ వచ్చేసింది? ఇక నుంచి ఇంట్లో కూర్చొని మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి..ఇలా
Author:
Ram Naik is the founder and content creator of Rammeesevatelugu.com. He is a Passionate content creator with over 4 years of experience, specializing in creating impactful and high quality content. He is a expertise in digital marketing, web designing and SEO strategies. He writes daily about online services, jobs notifications, and government schemes information in telugu. With a strong focus on public needs information. His ambition is to all types of useful information easily available to every reader in telugu