ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం ll రూ.6000/- రైతుల ఖాతాల్లో జమ..ఇలా అప్లై చేసుకోండి ll ఉండాల్సిన అర్హతలు ఇవే..

PM KISAN YOJANA SCHEME:

  • ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకపడిన చిన్న,సన్న కారు రైతులకు పంట పెట్టుబడి సాయం ఇచ్చే వుదేశం తో ఈ కిసాన్ యోజన స్కీం ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు 2019 వ ఇయర్ లో ప్రారంబించడం జరిగింది.ఈ పథకం ద్వారా ఎవరైతే రైతులు తక్కువ అంటే 5 ఎకరాల లోపు పొలం వున్నా చిన్న,సన్న కారు రైతులకు ఏడాదికి మూడు విడతల్లో ప్రతి విడతలో 2000రూ ఈ పథకం కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు.ఇప్పటి వరకు ఈ పథకం కింద ఇప్పటి వరకు 21వ విడత అమౌంట్ క్రెడిట్ చెయ్యడం జరిగింది ఇందులో బాగంగా ఈ పథకానికి ఉండాల్సిన అర్హతలు, అప్లై ప్రాసెస్ పూర్తి వివరాలు కింద వివరంగా తెలియజేయడం జరిగింది చూడండి.

Note Points:

  1. ఈ పియం కిసాన్ యోజన పథకం పూర్తిగా కేంద్రమే నడిపిస్తుంది.అంటే పూర్తిగా 100 శాతం నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే రైతుల ఖాతాల్లో జమ అవుతూ వస్తునాయి.ఈ పథకం లో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేదు.

  2. ఒక కుటుంబం లో ఎంత మందికి పొలం వున్నా ఒకరికి మాత్రమే ఈ పథకం కింద డబ్బులు ఇస్తారు.

  3. 2018 ఏడాది నుంచే ఈ పథకం అమల్లో వుంది.

  4. ఈ పథకం కింద ఒక ఏడాదిలో మూడు విడుతలు అంటే అందులో మొదటి విడత జూన్ నుంచి జూలై నెల మధ్యలో రిలీజ్ చేస్తారు.అలాగే రెండో విడత సెప్టెంబర్ నుంచి నవంబర్ నెల లోపు రిలీజ్ చేస్తారు.అలాగే మూడో విడత డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెలల లోపు అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో జమ చెయ్యడం జరుగుతుంది.

  5. పియం కిసాన్ స్కీం ను కొత్త గా అప్లై చేసుకోవాలి అంటే రెండు విధాలుగా అంటే సెల్ఫ్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా మీ నియర్ CSC సెంటర్ ల ద్వారా చేయొచ్చు.

కిసాన్ యోజన పథకంకి ఉండాల్సిన అర్హతలు:

  1. భారత పౌరులు అయ్యిండాలి

  2. చిన్న,సన్న కారు రైతులు అంటే 5 ఎకరాల లోపు పొలం వుండాలి.

  3. ఆర్థికంగా వెనుకబడిన రైతులు అయ్యి వుండాలి.

  4. మీ ఫ్యామిలీ లో గవర్నమెంట్ జాబ్ లేదా ఇన్కమ్ టాక్స్ పే చేసే వారు వుంటే మీరు అర్హులు కాదు.

  5. తెల్ల రేషన్ కార్డు కలిగి వుండాలి.

కావలిసిన పత్రాలు:

  1. పియం కిసాన్ అప్లికేషన్ ఫారం

  2. రైతు యొక్క పొలం పట్టా దారు పాస్ బుక్ వుండాలి.మీ పొలం ఆన్లైన్ వెబ్ ల్యాండ్ డేటా లో వుండాలి అలాగే ఆన్లైన్ డిజిటల్ సంతకం వుండాలి.

  3. దరఖాస్తుదారు యొక్క ఆధార్ కార్డు తప్పనిసారిగా వుండాలి.

  4. అలాగే రేషన్ కార్డు కలిగి వుండాలి.

  5. పాస్ పోర్ట్ సైజు ఫోటో వుండాలి.

  6. అలాగే రైతు యొక్క బ్యాంకు పాస్ బుక్ కలిగి వుండాలి.

  7. ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ వుండాలి.

  8. రైతు యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్

  9. కులం సర్టిఫికేట్

పియం కిసాన్ పథకం ఆన్లైన్ లో అప్లై చెయ్యు పూర్తి ప్రాసెస్:

  1. ఈ పథకం లో మనం చేరాలి అంటే రెండు విధాలుగా అప్లై చేస్కోవచ్చు.

  2. అందులో మొదటి ఆప్షన్ పియం కిసాన్ వెబ్సైటు లో మనమే సొంతంగా సెల్ఫ్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.లేదా సిఎస్ఈ సెంటర్ లలో అప్లై చేసుకోవచ్చు.

  3. పియం కిసాన్ వెబ్సైటు లో Farmer Registration ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  4. ముందుగా పియం కిసాన్ యొక్క అధికారిక వెబ్సైటు ఓపెన్ చేసుకోండి (వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి)

  5. వెబ్సైటు ఓపెన్ చేశాక అక్కడ మధ్యలో మీకు “New Farmer Registration’ ఆప్షన్ చూపిస్తుంది దాన్ని క్లిక్ చేసుకోండి.

  6. తదుపరి పేజిలో ఆధర్ నెంబర్ మరియు ఆధర్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చెయ్యండి అలాగే మీ రాష్ట్రము సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి కింద వున్నా’Get Otp’ ఆప్షన్ క్లిక్ చెయ్యండి.

  7. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ కి ఒటిపి వస్తుంది ఎంటర్ చేసుకోండి.

  8. తర్వాత మరో పేజి ఓపెన్ అవుతుంది.అందులో మీ భూమి యొక్క పూర్తి వివరాలు నమోదు చెయ్యండి.

  9. తదుపరి పేజిలో మీ బ్యాంకు వివరాలు మరియు అడ్రస్ వివరాలు నమోదు చేసుకోండి.

  10. అలాగే అందులో మీ ప్రూఫ్స్ యొక్క డాకుమెంట్స్ ని అప్లోడ్ చెయ్యలిసి వుంటుంది.

  11. ఇలా మీరు ప్రాసెస్ మొత్తం పూర్తి చేశాక సబ్మిట్ చేసుకుంటే మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

ఆఫ్ లైన్ ద్వారా ఎలా అప్లై చెయ్యాలి:

  1. ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి అంటే CSC సెంటర్ల లోనే చేసుకోవాలి.ఈ CSC సెంటర్లు మీ జిల్లా లేదా మండలలలో మాత్రమే వుంటాయి.

  2. మీ యొక్క అర్హత డాకుమెంట్స్ అంటే ఆధార్, రేషన్ కార్డు, భూమి యొక్క పత్రాలు,కులం సర్టిఫికేట్,ఇన్కమ్ సర్టిఫికేట్, ఇలా అన్ని డాకుమెంట్స్ తీసుకోని

  3. CSC సెంటర్ కి వెళ్లి అప్లై చేసుకోండి.కొత్తగా రిజిస్ట్రేషన్ నమోదు చేశాక అప్లై చేసినట్లు ఒక ఫార్మ్ వస్తుంది.ఎలిజబుల్ అయ్యాక మెసేజ్ వస్తుంది.

ఎలా ఎంపిక చేస్తారు?

  • పియం కిసాన్ వెబ్సైటు లో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేశాక మీ యొక్క అప్లికేషన్ వ్యవసాయ ఉన్నత అధికారులకు చేరుతుంది.

  • వారు మీ అప్లికేషను పూర్తిగా పరిశిలించి మీ భూమి యొక్క రికార్డ్స్ అన్ని ఆన్లైన్ లో పరిశిలించి, ఇలా మీ అర్హతలు చూసి ఫైనల్ గా మీ అప్లికేషన్ అప్ప్రోవ్ చేస్తారు.

  • ఆ తర్వాత మీ పేరు పియం కిసాన్ యొక్క ఎలిజబుల్ లిస్టు లో వస్తుంది.

  • ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అమౌంట్ విడుదల చేసినపుడు విడతల వారిగా వస్తాయి.

  • అలాగే ముఖ్యంగా మీరు అర్హత పొందక అమౌంట్ క్రెడిట్ అవ్వాలంటే కచ్చితంగా మీ బ్యాంకు ఎకౌంటు కి ఆధర్ లింక్ వుండాలి.లింక్ లేకపోతే మీ బ్యాంకు లోనే చేస్తారు చేసుకోండి.

పియం కిసాన్ స్టేటస్ ఎలా చూడాలి?

  • ఇందుకు గాను మీరు పియం కిసాన్ వెబ్సైటు ఓపెన్ చేశాక అక్కడే ‘Know Your Status” ఆప్షన్ వుంటుంది క్లిక్ చెయ్యండి

  • ఆ తర్వాత మీకు వేరే పేజి ఓపెన్ అవుతుంది అందులో మీ పియం కిసాన్ రిజిస్టర్ నెంబర్ అడుగుతుంది ఎంటర్ చేసుకోండి

  • ఒకవేళ మీకు ఆ నెంబర్ తెలియకపోతే అక్కడే Know Registration No అనే ఆప్షన్ వుంటుంది క్లిక్ చేసి అందులో తెలుసుకోవచ్చు.

  • అందులో మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఒటిపి ఎంటర్ చేసి మీ రిజిస్టర్ నెంబర్ తెలుసుకోవచ్చు.

  • రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసి Get Otp ఆప్షన్ క్లిక్ చేసి మీ యొక్క పియం కిసాన్ అప్లికేషను స్టేటస్ తెలుసుకోవచ్చు.

  • ఈ స్టేటస్ లో మనకు పియం కిసాన్ పేమెంట్ స్తితి కూడా చూపిస్తుంది.ఇప్పటి వరకు ఎన్ని విడతలు వచ్చాయో అక్కడ వుంటుంది.

  • అలాగే మీ పేరు ఎలిజబుల్ లిస్టు లో వుందో లేదో ఈ వెబ్సైటు లోనే తెలుసుకోవచ్చు.

  • ఈ వెబ్సైటు లో Beneficiary List ఆప్షన్ వుంటుంది క్లిక్ చెయ్యండి.

  • ఆ తర్వాత మరో పేజి ఓపెన్ అవుతుంది అందులో మీ స్టేట్, జిల్లా, గ్రామం సెలెక్ట్ చేసుకొని Get Report ఆప్షన్ క్లిక్ చేస్తే ఒక లిస్టు ఓపెన్ అవుతుంది

  • అందులో మీ పేరు వుందో లేదో తెలుసుకోవచ్చు.లిస్టు లో పేరు వుంటే అమౌంట్ క్రెడిట్ అవుతుంది.

పియం కిసాన్ డబ్బులు పొందాలి అంటే E-KYC తప్పనిసరి:

  •  మీరు ఈ స్కీం కి అర్హత పొందిన కూడా మీకు అమౌంట్ రావాలి అంటే తప్పకుండ kyc చేసుకోవాలి.

  • ఈ E-KYC పియం కిసాన్ వెబ్సైటు లోనే ఒటిపి ద్వారా చేసుకోవచ్చు లేదా CSC సెంటర్ లలో కూడా చేసుకోవచ్చు.

  • ముందుగా వెబ్సైటు లోకి వెళ్ళండి అక్కడ e-kyc ఆప్షన్ వుంటుంది క్లిక్ చెయ్యండి.

  • ఆ తర్వాత మరొక పేజి ఓపెన్ అవుతుంది.అక్కడ మీ ఆధార్ మరియు భూమి వివరాలు నమోదు చేసి ఒటిపి ద్వార ప్రాసెస్ పూర్తి చేసుకోండి.

  • ఇందులో ప్రాసెస్ మీకు రాకపోతే CSC సెంటర్ కే వెళ్లి ప్రాసెస్ చేసుకోండి.

గమనిక: ఈ పథకం గురించి ఇంకా ఏవైనా సందేహాలు వుంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

 

Read Also:

ఆధార్ కొత్త ఆప్షన్ వచ్చేసింది? ఇక నుంచి ఇంట్లో కూర్చొని మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి..ఇలా

 

Author:

Web |  + posts

Ram Naik is the founder and content creator of Rammeesevatelugu.com. He is a Passionate content creator with over 4 years of experience, specializing in creating impactful and high quality content. He is a expertise in digital marketing, web designing and SEO strategies. He writes daily about online services, jobs notifications, and government schemes information in telugu. With a strong focus on public needs information. His ambition is to all types of useful information easily available to every reader in telugu

Leave a Comment