Pm Awas Yojana scheme:
-
ఈ పథకం లో భాగం గా ఇల్లు లేని నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం పియం ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు మంజూరు చేస్తున్నారు.ఈ పథకం ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు 2015 వ ఏడాదిలో ప్రారంబించడం జరిగింది.ఈ పథకం ను గ్రామీణ ప్రాంతాల్లో వారికి అలాగే పట్టణ ప్రాంతాల వారికి అయిన అర్హత వున్నా వారికి ఇస్తున్నారు.కావున ఈ పథకం యొక్క దరఖాస్తు ప్రక్రియ అలాగే అర్హతలు, కావలిసిన పత్రాలు మొదలగు ముఖ్య విషయాల గురించి కింద వివరంగా తెలుసుకుందాం.
Note Points:
-
ఇందులో మెయిన్ గా రెండు రకాల పథకాలు వున్నాయి అవి ఒకటి గ్రామాల వారికి రూరల్ గృహ పథకం అలాగే సిటీ వారికి అర్బన్ గృహ పథకం.
-
మనం ఈ పథకానికి ఈ ఆవాస్ యోజన యొక్క అధికారిక వెబ్సైటు ద్వారా అప్లై చెయ్యొచ్చు లేదా ఆఫ్ లైన్ లో హౌసింగ్ డిపార్టుమెంటు వారి దగ్గర అప్లై చేసుకోవచ్చు.
-
రేషన్ కార్డు వున్నా కుటుంబం లో ఒకరికి మాత్రమే ఇది వర్తిస్తుంది.
-
పెళ్లి అయ్యి సొంత ఇల్లు లేకుండా ఖాళి స్తలం వున్నావారు అర్హులు.
-
మీకంటూ సొంత ఇల్లు లేకున్నా మీ పేరు మిద ఇంటి పన్ను లేదా కరెంటు మీటర్ వుంది అంటే మీకు ఇల్లు వుంది అనే కింద ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి మీరు అర్హత పొందలేరు.
-
మీ ఏరియా లో ఈ పథకం ఎలిజాబుల్ వుందో లేదో మీ దగ్గరలో వుండే ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా సచివాలయం లో లేదా హౌసింగ్ డిపార్టుమెంటు వారిని అడగండి అప్లై చేసుకోండి..
ఉండాల్సిన అర్హతలు:
-
భారత దేశ పౌరులు మాత్రమే అర్హులు.
-
ఇండియాలో ఎక్కడ కూడా సొంత ఇల్లు ఉండకుడదు.
-
ఆర్ధికంగా వెనుకబడిన వారికే ఈ పథకం కింద ఇల్లు మంజూరు చేస్తారు.
-
తెల్ల రేషన్ కార్డు కలిగి వుండాలి.
-
వయసు పరిమితి అయితే లేదు.
-
అర్బన్ ఆవాస్ యోజన స్కీం కి కింది విధంగా ఇన్కమ్ పరిమితిని బట్టి ఇల్లు మంజూరు చేస్తారు.
-
ఇందులో EWS (ఆర్థికంగా బలహీన వర్గాలు) వార్షిక ఆదాయం ౩ లక్షల లోపే వుండాలి.
-
అలాగే LIG(తక్కువ ఆదాయ వర్గాలు) వార్షిక ఆదాయం ౩ లక్షల నుంచి 6 లక్షల వరకు అర్హులు.
-
అదే విధంగా MIG (మధ్య ఆదాయ వర్గం) 6 లక్షల నుంచి 12 లక్షల లోపే వుండాలి.
-
అలాగే గ్రామిన ఆవాస్ యోజన అయితే గ్రామాల్లో వుండే షెడ్యూల్ కులాలు/తెగల వారికి,భూమి లేని వారికి ప్రాధాన్యత వుంటుంది.
అప్లై కొరకు ఉండాల్సిన పత్రాలు:
-
దరఖాస్తుదారులకు ఇండియాలో ఎక్కడ కూడా సొంత ఇల్లు వారి పేరు మిద ఉండకుడదు.
-
దరఖాస్తుదారు గుర్తింపు యొక్క ఆధార్ కార్డు కలిగి వుండాలి.
-
అలాగే ఆవాస్ యోజన యొక్క అప్లికేషను ఫార్మ్ వుండాలి.
-
పాస్పోర్ట్ సైజు ఫొటోస్ వుండాలి.
-
తెల్ల రేషన్ కార్డు వుండాలి.
-
సొంత స్తలం వుండాలి.ఇల్లు కాకుండా
-
దరఖాస్తుదారు యొక్క ఇన్కమ్ మరియు కుల ద్రువికరణ పత్రాలు వుండాలి.
-
అలాగే ముఖ్యంగా బ్యాంకు పాస్ బుక్ కలిగి వుండాలి.
-
Mgnrega బుక్ వుండాలి.
-
ఇంకా అవసరమైన అన్ని డాకుమెంట్స్ సిద్దంగా ఉంచుకోండి.
ఎవరు అర్హులు కాదు?
-
ఇండియా లో సొంత ఇల్లు వుంటే ఈ పథకం వర్తించదు.
-
గవర్నమెంట్ జాబు లేదా ఇన్కమ్ టాక్స్ పే చేసే వారు అనర్హులు.
-
వార్షిక ఆదాయం 12 లక్షల కంటే ఎక్కువ వున్నా వారు అనర్హులు.
ఆవాస్ యోజన పథకం అప్లై ప్రాసెస్:
-
ముందుగా పియం ఆవాస్ యోజన అధికారిక వెబ్సైటు అయిన PMAY సైట్ ఓపెన్ చేసుకోండి(వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి)
-
వెబ్సైటు ఓపెన్ చేశాక అందులో Pm Awas Yojana apply ఆప్షన్ క్లిక్ చేసుకోండి.
-
ఆ తర్వాత మరొక పేజి ఓపెన్ అవుతుంది.అందులో సిటిజెన్ అస్సిస్మెంట్ ఆప్షన్ క్లిక్ చెయ్యండి.
-
తదుపరి పేజిలో మీ యొక్క గుర్తింపు కార్డు అంటే ఆధార్ కార్డు వివరాలు బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చెయ్యండి.
-
ఆ తర్వాత మరొక పేజిలో ఆన్లైన్ అప్లికేషను చూపిస్తుంది.అందులో చూపించే ప్రతి ఆప్షన్ పూర్తిగా జాగ్రతగా నమోదు చేసుకోండి.
-
తదుపరి పేజిలో మీ యొక్క డాకుమెంట్స్ అక్కడ అప్లోడ్ చెయ్యండి.
-
ఇలా అప్లికేషను మొత్తం పురించక సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి.ఆ తర్వాత మీరు అప్లై చేసిన ఫారం చూపిస్తుంది.సేవ్ చేసుకొండి.
-
అప్లై చేశాక మీ దరఖాస్తు స్టేటస్ ఆన్లైన్ లోనే చెక్ చేసుకోవచ్చు.
-
మీరు అప్లై చేసిన అప్లికేషన్ హౌసింగ్ యొక్క ఉన్నతాధికారులకు చేరుతుంది.
-
ఆ తర్వాత మీరు అర్హుల లేదా అనేది పూర్తిగా పరిశిలించి ఇల్లు మంజూరు చేస్తారు తర్వాత మీకు ఇంటి అమౌంట్ వస్తుంది.
-
ఇలా మీరు ప్రాసెస్ పూర్తి చేసుకోండి.
గమనిక: ఈ పథకం సంబంధించి ఇంకా ఏవైనా సందేహాలు వుంటే కింద కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి.
Read Also;
ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం ll రూ.6000/- రైతుల ఖాతాల్లో జమ..ఇలా అప్లై చేసుకోండి ll ఉండాల్సిన అర్హతలు ఇవే..
Author:
Ram Naik is the founder and content creator of Rammeesevatelugu.com. He is a Passionate content creator with over 4 years of experience, specializing in creating impactful and high quality content. He is a expertise in digital marketing, web designing and SEO strategies. He writes daily about online services, jobs notifications, and government schemes information in telugu. With a strong focus on public needs information. His ambition is to all types of useful information easily available to every reader in telugu