Pan Card: ప్రస్తుతం ఆర్ధికంగా ఎటువంటి పని జరగాలన్న పాన్ కార్డు అనేది చాలా అవసరం అయ్యింది.బ్యాంకు ఎకౌంటు కొరకు అయిన అలాగే లోన్స్ కొరకు అయిన ఇలా దేనికొరకు అయిన పాన్ కార్డు లేకపోతే పని జరగదు.కొత్తగా పాన్ కార్డు అప్లై చేసుకోవాలి అంటే చాలా సులభంగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.ఎలా చేసుకోవాలో కింద వివరంగా తెలియజేయడం జరిగింది.చూసి అప్లై చేసుకోండి.
కావలిసిన డాకుమెంట్స్:
-
పాస్పోర్ట్ సైజు ఫోటో వుండాలి.
-
తెల్ల కాగితం మిద సంతకం వుండాలి.
-
ఒరిజినల్ ఆధార్ కార్డు పిడిఎఫ్ వుండాలి.
-
ఆధర్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ వుండాలి.
Note:
-
సైట్ లో కొత్తగా పాన్ కార్డు అప్లై చేశాక మూడు రోజుల్లో ఈ-పాన్ కార్డు మెయిల్ కి పంపడం జరుగుతుంది.
-
అప్లై చేసి 15 రోజులు అయ్యాక పోస్ట్ ద్వార ఒరిజినల్ పాన్ కార్డు ఆధార్ అడ్రస్ కి వస్తుంది.
-
పాన్ కార్డు ఒకసారి మాత్రమే అప్లై చేయడానికి వస్తుంది.
పాన్ కార్డు కొరకు ఆన్లైన్ లో అప్లై చేయు పూర్తి విధానం:
Step1:
-
ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకొని NSDL పాన్ వెబ్సైటు ఓపెన్ చేసుకోండి.ఆ తర్వాత పాన్ అప్లికేషను ఓపెన్ అవుతుంది.అక్కడ పాన్ టైప్ దగ్గర ‘New Pan-Indian Citizen (Form49A)’ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.అలాగే పక్కనే అప్లికేషను కేటగిరి దగ్గర Individual ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. (వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి)
-
అలాగే కింది భాగంలో “Application Information’ లో మీ పూర్తి పేరు ఎంటర్ చెయ్యండి.అదే విధంగా మీ పుట్టిన తేది మరియు మెయిల్ ఐడి ఎంటర్ చేసుకొని కింద సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి.
Step2:
-
ఆ తర్వాత మీకు టోకెన్ నెంబర్ జేనరేట్ అవుతుంది.ఆ తర్వాత చూపించే ‘Continue With Pan Application” ఆప్షన్ క్లిక్ చేసుకోండి.
-
ఆ తర్వాత పేజిలో మిగతా అప్లికేషను పూర్తి ప్రాసెస్ చేసుకోవాలి.అందులో పర్సనల్ డీటెయిల్స్ మరియు డాకుమెంట్స్ అప్లోడ్ అలాగే పేమెంట్ ప్రాసెస్ ఇలా స్టెప్స్ ప్రకారం మిగతా అప్లికేషను ఫిల్ చేసుకోండి.
Step౩:
-
అందులో రెండవ ఆప్షన్ ‘Submit Scanned Images through e-sign ‘ సెలెక్ట్ చేసుకోండి.అలాగే కింద ఆధర్ చివరి నాలుగు అంకెలు ఎంటర్ చెయ్యండి.
-
అలాగే కింద ఆధార్ లో వున్నా విధంగా పూర్తి పేరును ఎంటర్ చెయ్యాలి.అదే విధంగా అందులోనే కింది భాగం లో ఫాదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ నాన్న పూర్తి పేరు ఎంటర్ చేసుకోండి.
-
మన పాన్ కార్డు లో మగ వారికి అయిన ఆడ వారికి నాన్న పేరు మాత్రమే వస్తుంది.ఫిల్ చేశాక కింద వుండే నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చెయ్యండి.
Step4:
-
తదుపరి పేజిలో మీ ఇన్కమ్ డీటెయిల్స్ అలాగే ఆధర్ అడ్రస్ ను నమోదు చేసుకోండి.
-
అలాగే కింది భాగం లో మీ మొబైల్ నెంబర్ నమోదు చేసుకొని కింద నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి.
Step5:
-
తదుపరి పేజిలో Area Code మరియు Area Type వివరాలు నమోదు చేసి నెక్స్ట్ ఆప్షన్ లోకి వెళ్ళండి.
Step6:
-
ఆ తర్వాత తదుపరి పేజిలో డాకుమెంట్స్ అప్లోడ్ చేసే ఆప్షన్స్ చూపిస్తాయి అందులో గుర్తింపు అలాగే అడ్రస్ ప్రూఫ్ మరియు పుట్టిన తేది దగ్గర ఆధార్ ఆప్షన్ నే సెలెక్ట్ చేసుకోండి.
-
అందులోనే కింది భాగం లో మీ పాస్పోర్ట్ సైజు ఫోటో అలాగే మీ సంతకం అప్లోడ్ చేసుకోండి అలాగే కింద ఆధర్ పిడిఎఫ్ అప్లోడ్ చేసుకోండి.
-
డాకుమెంట్స్ అప్లోడ్ చేశాక Submit ఆప్షన్ క్లిక్ చేసుకొండి.
Step7:
-
తదుపరి పేజిలో personal Details దగ్గర ఆధార్ మొదటి ఆరు అంకెలు నమోదు చేసి, కింద proceed ఆప్షన్ క్లిక్ చేసుకొండి.
-
ఆ తర్వాత పేజిలో Payment ఆప్షన్ చూపిస్తుంది.అందులో ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ ఫోనేపే ద్వారా 107Rs పేమెంట్ కంప్లీట్ చేసుకోండి.
-
నెక్స్ట్ పేమెంట్ కంప్లీట్ అయిన స్లిప్ చూపిస్తుంది.ఆ తర్వాత కింద Authenticate ఆప్షన్ క్లిక్ చెయ్యండి.
-
తదుపరి పేజిలో ఆధర్ ఓటిపి వస్తుది ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి.
Step8 :
-
ఆ తర్వాత పేజిలో ‘Continue with E-sign’ ఆప్షన్ క్లిక్ చెయ్యండి.తదుపరి పేజిలో ఆధర్ నెంబర్ ను ఎంటర్ చేసి ఓటిపి ప్రాసెస్ చేసుకోండి.
-
ఇలా మీరు ఈ ప్రాసెస్ వరకు కంప్లీట్ చేశాక ఫైనల్ గా అప్లికేషను పిడిఎఫ్ వస్తుంది.
ఆఫ్ లైన్ లో పాన్ కార్డు అప్లై చేయు పూర్తి ప్రాసెస్:
-
ముందుగా పాన్ అధికారిక వెబ్సైటు నుంచి Pan Form(49A) ప్రింట్ తీసుకోండి.
-
ఆ ఫారం లో మీ పేరు మరియు ఫాదర్ పేరు అలాగే మీ పుట్టిన తేది మరియు అడ్రస్ వివరాలను నమోదు చేసుకోండి.
-
అలాగే ఫారం పైన రెండు వైపుల మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో అతికించండి.
-
అలాగే ఎడమ వైపు ఫోటో మధ్య నుంచి మీ సంతకం చెయ్యండి అలాగే కుడి వైపు పోటో కింద సంతకం చెయ్యండి.
-
అదే విధంగా ఫారం వెనుక వైపు కింద బాక్స్ లో సంతకం చెయ్యండి.
-
ఇలా ఫిల్ చేశాక ఈ ఫారం తో పాటు ఆధర్ కార్డు కాపీ తో పాటు మీ దగ్గరలో వుండే పాన్ సెంటర్ లో అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసిన పాన్ కార్డు స్టేటస్ చెక్ చేయు పూర్తి ప్రాసెస్:
-
ముందుగా గూగుల్ లో Nsdl పాన్ స్టేటస్ అని సెర్చ్ చెయ్యండి.అక్కడ మీకు ఒక వెబ్సైటు చూపిస్తుంది ఓపెన్ చేసుకొండి.
-
తదుపరి పేజిలో Track అప్లికేషన్ స్టేటస్ పేజి ఓపెన్ అవుతుంది అక్కడ Application టైప్ సెలెక్ట్ చేసి కింద మీరు పాన్ అప్లై చేశాక ఒక ఒక నెంబర్ వచ్చింటుంది.
-
ఆ నెంబర్ ని అక్కడ Acknowledgement నెంబర్ దగర ఎంటర్ చేసి కింద Submit ఆప్షన్ క్లిక్ చెయ్యండి.
-
తదుపరి పేజిలో మీ పాన్ కార్డు స్టేటస్ చూపిస్తుంది.అప్ప్రోవ్ అయ్యింద లేదా పెండింగ్ వుందా అనేది చూపిస్తుంది.
More Info:
-
ఇందులో చెప్పిన స్టెప్స్ ప్రకారం మీరు ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మూడు రోజుల్లో పాన్ కార్డు పిడిఎఫ్ మన మెయిల్ ఐడి కి వస్తుంది.
-
అలాగే ఒరిజినల్ పాన్ కార్డు పోస్ట్ కి 20 రోజుల లోపు వస్తుంది.
-
అదే విధంగా మీరు అప్లై చేసిన పాన్ కార్డు ఎక్కడి దాకా వుందో స్టేటస్ ఏంటి అనేది ఈ వెబ్సైటు లోనే పాన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
-
మీరు సొంతం గా అప్లై చేసుకోవాలి అంటే ఈ వెబ్సైటు లో చేసుకోండి.లేదా మీ దగ్గరలో వుండే పాన్ సెంటర్ లో డాకుమెంట్స్ తీస్కొని వెళ్లి అప్లై చేసుకొండి.
-
అలాగే మీకు అంతకు ముందే పాన్ కార్డు వుండి ఆ పాన్ కార్డు లో మార్పులు చేసుకోవాలి అంటే ఈ వెబ్సైటు లోనే చేసుకోవచ్చు.
-
అలాగే తప్పని సరిగా మీ పాన్ కార్డు కి ఆధర్ లింక్ వుండాలి.ఆధార లింక్ లేకపోతే చేసుకోండి.
-
అలాగే మీరు గతం లోనే అప్లై చేసిన పాన్ కార్డు మీ దగ్గర లేకపోతే ఆ పాన్ కార్డు ను డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
పాన్ కార్డు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేయు పూర్తి విధానం:
-
ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకొని అందులో “Nsdl e-Pan Card’ అని సెర్చ్ చేస్తే NSDL వెబ్సైటు చూపిస్తుంది దాన్ని ఓపెన్ చేసుకోండి.
-
పేజి ఓపెన్ అయ్యాక అందులో మీ యొక్క పాన్ కార్డు నెంబర్ మరియు ఆధార్ నెంబర్ వివరాలు నమోదు చేసుకోండి.అలాగే పుట్టిన తేది ఎంటర్ చెయ్యండి.
-
ఆ తర్వాత కింద Submit ఆప్షన్ క్లిక్ చెయ్యండి.
-
తదుపరి పేజిలో మీ పాన్ కార్డు కు లింక్ వున్నా మెయిల్ ఐడి కి ఓటిపి వస్తుంది అది ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకుంటే మన మెయిల్ ఐడి కి పాన్ కార్డు పిడిఎఫ్ రూపం లో సెండ్ చేయడం జరుగుతుంది.
Read Also:
Train Ticket Booking: ఈ యాప్ లో రెండు నిమిషాల్లోనే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..
Author:
Ram Naik is the founder and content creator of Rammeesevatelugu.com. He is a Passionate content creator with over 4 years of experience, specializing in creating impactful and high quality content. He is a expertise in digital marketing, web designing and SEO strategies. He writes daily about online services, jobs notifications, and government schemes information in telugu. With a strong focus on public needs information. His ambition is to all types of useful information easily available to every reader in telugu