SBI Credit Card: మిత్రులారా మీకు ఏదైనా సేవింగ్ బ్యాంకు ఎకౌంటు కలిగి వుండి నెలకు తగిన ఆదాయం వుండి అవసరానికి ఉపయోగించుకోవడానికి మంచి క్రెడిట్ కార్డు కొరకు చుస్తునట్లుయితే మన ఎస్బిఐ బ్యాంకు లో చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అందుబాటులో వున్నాయి.చాలా సులభంగా ఈ క్రెడిట్ కార్డ్స్ పొందోచ్చు.ఎస్బి ఐ సంబందించిన అధికారిక వెబ్సైటు లోనే ఈ క్రెడిట్ కార్డ్స్ ని అప్లై చేసుకోవచ్చు.ఇందులో భాగంగానే ఈ ఎస్బి ఐ లో ఎన్ని రకాల క్రెడిట్ కార్డ్స్ వున్నాయి ఎలా అప్లై చేసుకోవాలి కావలిసిన డాకుమెంట్స్ ఏంటి వుండలిసిన అర్హతలు ఏంటి అనే పూర్తి సమాచారం ఇక్కడ కింద వివరంగా తెలియజేయడం జరిగింది చూసి అప్లై చేసుకోండి..
ఎస్బిఐ క్రెడిట్ కార్డు పొందడం ద్వార కలిగే బెనిఫిట్స్:
-
ఈ ఎస్బి ఐ క్రెడిట్ కార్డు యూస్ చేయడం ద్వార మీకు క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ అలాగే రివార్డ్ పాయింట్స్ ఇలా చాలా రకాల ఉపయోగాలు వున్నాయి.
-
ఈ ఎస్బి ఐ క్రెడిట్ కార్డ్స్ లలో ఒకో కార్డు ద్వార ఒక రకమైన బెనిఫిట్ వుంటుంది.
-
అదే విధంగా ఈ క్రెడిట్ కార్డు ను వాడడం ద్వార మీ సిబిల్ స్కోర్ ను కూడా మెరుగుపరుచు కోవచ్చు.
-
అలాగే ఈ ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వార ఆన్లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో కూడా ఈ యం ఐ లో వస్తువులను కొనుగోలు చెయ్యొచ్చు.
-
ముక్యంగా ఈ క్రెడిట్ కార్డ్స్ ని పొందడం సులభమే కాని చాలా జాగ్రతగా ఉపయోగించాలి.క్రెడిట్ కార్డు బిల్ల్స్ ను గడువు లోపు చెల్లించాలి లేకపోతే లేట్ పేమెంట్ చార్జెస్ పడతాయి కావున చాలా జాగ్రతగా ఉపయోగించుకోండి..
-
అలాగే క్రెడిట్ కార్డ్స్ కలిగిన వారికి కొన్ని రకాల ఆన్లైన్ ల చెల్లింపుల సమయం లో తకువగా పేమెంట్ చేసేలా ఆఫర్లు చాలా వుంటాయి.
-
అలాగే మీకు క్రెడిట్ కార్డు అవసరం వుండి జాగ్రతగా వుపయోగించుకుంటాం అనుకుంటేనే క్రెడిట్ కార్డు తీసుకోండి.లేకపోతే వద్దు.
ఎస్బి ఐ క్రెడిట్ కార్డు కొరకు ఉండాల్సిన అర్హతలు:
-
వయసు 21 నుంచి 60 ఏళ్ళ లోపు వారు ఎలిజబుల్
-
అలాగే నెల ఆదాయం మినిమం 2000౦/- లేదా అంతకన్నా ఎక్కువ వుండాలి.
-
ముక్యంగా మన సిబిల్ స్కోర్ 75౦ లేదా అంతకన్నా ఎక్కువ వుండాలి.
-
అదే విధంగా వుద్యోగం చేసే వారు లేదా స్వయం ఉపాధి వారు అయిన ఎలిజబుల్ అవుతారు.
-
అలాగే అప్లై సమయం లో ఇన్కమ్ ప్రూఫ్ నమోదు చేయాలి.
క్రెడిట్ కార్డు దరఖస్తూ సమయం లో కావలిసిన డాకుమెంట్స్:
-
గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు,డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్ మొదలగునవి)
-
ఆన్లైన్ లో అప్లై కొరకు అయితే తప్పకుండా ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ వుండాలి.
-
అలాగే ఒరిజినల్ పాన్ కార్డు వుండాలి.
-
అదే విధంగా ఆన్లైన్ లో అప్లై చేసుకుంటూన్నట్లు అయితే వీడియో కే వై సి చెయ్యాల్సి వుంటుంది.
-
అలాగే అప్లై సమయం లో మీ అడ్రస్ వివరాలను నమోదు చేసుకోవాలి.
ఎస్బిఐ క్రెడిట్ కార్డు ఆన్లైన్ లో అప్లై చెయ్యు పూర్తి విధానం:
-
ముందుగా ఎస్బి ఐ అధికారిక వెబ్సైటు ను ఓపెన్ చేసుకోండి.(https://www.sbicard.com)
-
అందులో మనకు క్రెడిట్ కార్డ్స్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి.అందులో మనకు చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ వుంటాయి.అలాగే వాటి బెనిఫిట్స్ కూడా వుంటాయి.
-
మీ అవసరాలకు తగ్గట్లుగా కార్డును సెలెక్ట్ చేసుకోండి.
-
వాటిల్లో మీరు కావాలి అనుకుంటున్నా క్రెడిట్ కార్డు సెలెక్ట్ చేసుకోండి.
-
అక్కడ మనకు Apply Now ఆప్షన్ వుంటుంది.క్లిక్ చేసుకోండి.
-
ఆ తర్వాత తదుపరి పేజి ఓపెన్ అవుతుంది.
-
ఈ క్రెడిట్ కార్డు అప్లికేషను మనకు మొత్తం మూడు రకాల స్టెప్స్ లో వుంటుంది అవి కంప్లీట్ చేసుకుంటేనే మనకు కార్డు అప్ప్రోవ్ అవుతుంది.
-
మొదటి స్టెప్ లో మీ యొక్క personal డీటెయిల్స్ అంటే మీ యొక్క పేరు,మొబైల్ నెంబర్,పుట్టిన తేది,మీ యొక్క పాన్ వివరాలు నమోదు చేసుకోవాలి.
-
తదుపరి రెండవ స్టెప్ లో మీ యొక్క ఉపాధి వివరాలు అంటే మీరు చేసే పని అలాగే ఆదాయం వివరాలు నమోదు చేసుకొండి.
-
ఆ తర్వాత మీకు ఈ ఎస్బి ఐ క్రెడిట్ కార్డు అర్హత వుంటే కార్డు ఇష్యూ అవుతుంది.
-
ఆ తర్వాత మీకు మూడవ స్టెప్ లో కేవైసి వివరాలు అంటే అడ్రస్,పిన్ కోడ్ అలాగే వీడియో కే వై సి పూర్తి చేసుకోండి.
-
ఇలా మీరు ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యాక మీ యొక్క క్రెడిట్ కార్డు మరియు దాని యొక్క క్రెడిట్ కార్డు లిమిట్ చూపిస్తుంది.
-
ఆ క్రెడిట్ కార్డు ను మీరు అన్ని విధాలుగా వాడుకోవచ్చు.మీ యొక్క యుపి ఐ యాప్ లో యాడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు.
-
ఇలా మీరు అందులో వున్నా ఏ క్రెడిట్ కార్డు కావాలి అన్న ఇలాగె ప్రాసెస్ చేసుకోవాలి.
Read Also:
ఆధార్ కార్డులో అడ్రస్ మీ మొబైల్ లోనే ఈజీ గా మార్చుకోండి… సింపుల్ ప్రాసెస్
Author:
Ram Naik is the founder and content creator of Rammeesevatelugu.com. He is a Passionate content creator with over 4 years of experience, specializing in creating impactful and high quality content. He is a expertise in digital marketing, web designing and SEO strategies. He writes daily about online services, jobs notifications, and government schemes information in telugu. With a strong focus on public needs information. His ambition is to all types of useful information easily available to every reader in telugu