ముద్ర లోన్: 50 వేల నుంచి 10 లక్షల వరకు బ్యాంకు రుణాలు..వెంటనే అప్లై చేసుకోండి.అర్హతలివే

ముద్ర లోన్: ఈ ముద్ర యోజన పథకంను కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 8వ తేదిన ప్రధాన మంత్రి మోడీ గారు ఈ స్కీం ను ప్రారంబించడం జరిగింది.ఈ పథకం కింద లోన్ పొందాలి అంటే ఎవరైతే ఏదైనా వ్యాపారం లేదా ఎంటర్ర్ ప్రేనుర్ గా ఉంటారో వారికి ఈ పథకం కింద 50 వేల నుంచి 20 లక్షల వరకు బ్యాంకు రుణాలను మంజూరు చేస్తారు.ఎటువంటి హామీ లేకుండా ఈ పథకం కింద రుణాలను మంజూరు చేస్తునారు.ఈ ముద్ర లోన్ లో మొత్తం మూడు రకాల పథకాలు వున్నాయి.మీరు ఏ వ్యాపారం చేస్తునారు అనే దాని బట్టి మీకు పథకం వర్తిస్తుంది.ఈ పథకం యొక్క పూర్తి వివరాలను కింద వివరంగా తెలియజేయడం జరిగింది.చుడండి.

ముద్ర లోన్ ఎన్ని రకాలు ?

  • ఈ పథకం కింద లబ్దిదారు చెయ్యాలి అనుకుంటున్నా పరిశ్రమ ఏ దశలో వుంది అనే దాన్నిబట్టి మొత్తం మూడు రకాల పథకాలలో రుణాలు ఇస్తారు.

  • శిశు విభాగం : ఇందులో ఏదైనా చిన్న వ్యాపారాన్ని కొత్తగా ప్రారంబించాలి అనుకుంటున్నా వారికి కేవలం 50 వేల లోపే ఋణం మంజూరు చేస్తారు. శిశు రుణాలలో 1 నుంచి 12 శాతం వరకు వడ్డీ వుంటుంది.

  • కిషోర్ విబాగం: ఇందులో 50 వేల నుంచి 5 లక్షల వరకు ఋణం ఇస్తారు.కిషోర్ రుణాలలో 8.6 శాతం నుంచి వడ్డీ వర్తిస్తుంది.

  • తరుణ్ విబాగం: ఈ పథకం కింద రూ.5 లక్షల నుంచి 20 లక్షల వరకు లోన్ ఇస్తారు.ఇందులో 11 నుంచి 20 శాతం లోపు వడ్డీ ప్రారంభం అవుతుంది.

ఏ వ్యాపారాలకు రుణాలు ఇస్తారు?

  • సుక్ష్మ, చిన్న తరహ కొత్త పరిశ్రమలకు వ్యాపారాలు నడిపే వారికి ఈ పథకం కింద రుణాలు ఇస్తారు.

  • వ్యవసాయం కి అనుబంధం గా వుండే చేపల పెంపకం మరియు కోళ్ళ ఫారాలకు అలాగే  డైరీ రంగం అలాగే మిగతా వాటికి కొత్త గా ప్రారంబించదానికి లేదా విస్తరించడానికి ఈ రుణాలు ఇస్తారు.

  • అలాగే పండ్ల వ్యాపారం టిఫిన్ సెంటర్లు మరియు కూరగాయల వ్యాపారం లేదా కిరణం షాపులు అలాగే హోటల్స్ వంటి చిన్న,మధ్య రకం వ్యాపారం ప్రారంబించడానికి లేదా వున్నా దానిని విస్తరించడానికి ఈ ముద్ర లోన్ ఇస్తారు.

  • అలాగే రవాణా రంగం లో ట్రక్ డ్రైవర్ లు ,క్యాబ్, ఆటో డ్రైవర్ లకు వాహనాల కొనుగోలు కొరకు అలాగే మెషిన్ ఆపరేటర్లు అలాగే చేతి వృతుల పరిశ్రమ లకు, ఈ పథకం కింద రుణాలు ఇస్తారు.

  • అదే విధంగా టైలరింగ్ అలాగే బ్యూటీ పార్లర్ లకు అలాగే మిగతా అన్ని రకాల పరిశ్రమలకు లోన్స్ ఇస్తారు.లోన్స్ తీస్కొని వాయిదాల పద్హతిలో రుణాలు తిరిగి చేలించాలి.

ముద్ర లోన్ పొందాలంటే అర్హతలు ఏంటి:

  • 18 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ లోపు వారు ఈ పథకానికి అర్హులు.

  • ఇందులో ముఖ్యంగా తయారి రంగం లేదా వర్తకం అలాగే సేవల రంగం అలాగే వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు వంటి రంగాలలో ఆదాయాన్ని సంపాదించే వ్యాపారం కలిగి వుండాలి.

  • అలాగే లబ్దిదారు యొక్క రుణాల చెల్లింపు హిస్టరీ బాగుండాలి.

  • తప్పనిసరిగా బ్యాంకు ఎకౌంటు కలిగి వుండాలి.

కావలిసిన పత్రాలు ఏంటి?

  • ప్రబుత్వం జారి చేసిన ఏదైనా గుర్తింపు కార్డు వుండాలి.(ఆధార్ కార్డు,డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు, వోటర్ కార్డు లలో ఏదో ఒకటి)

  • అడ్రస్ ప్రూఫ్ కార్డు ఆధర్ లేదా ఓటర్ కార్డు లేదా బ్యాంకు పాస్ బుక్ లేదా ఆస్థి పన్ను రసీదు లలో ఏదో ఒకటి)

  • బ్యాంకు పాస్ బుక్ కాపీ

  • ఇటివల దిగిన పాస్ పోర్ట్ సైజు ఫోటోలు వుండాలి.

  • అలాగే వ్యాపారానికి సంబదించి కోటేషాన్ డాకుమెంట్స్ కలిగి వుండాలి.

  • అదే విధంగా ఆరు నెలల బ్యాంకు స్టేట్ మెంట్ వుండాలి.

  • వ్యాపారానికి సంబందించిన పత్రాలు వుండాలి.(చిరునామా రుజువు,యాజమాన్య పత్రాలు మొదలగునవి)

Note Points:

  • ఈ రుణాలకు ఎటువంటి తనక లేదా సెక్యూరిటీ అవసరం లేదు.

  • ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద రుణాలు మంజూరు చేస్తారు.

  • ఈ పథకం కింద తీసుకున్న లోన్ 1 ఏదాది నుంచి 5 ఏళ్ళ లోపు నెల వారిగా చేల్లిన్చొచ్చు.

  • ప్రధాన మంత్రి ముద్ర లోన్ కింద శిశు లోన్ కి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు.

  • కాని తరుణ్,కిషోర్ విబాగం లో మాత్రం స్వల్ప ప్రాసెసింగ్ ఫిజు వుంటుంది.ఇది మీరు తీస్కునే బ్యాంకు లను బట్టి వుంటుంది.

  •  అలాగే మహిళలకు ఈ పథకం కింద సబ్సిడీ కూడా లబిస్తుంది.అలాగే ప్రత్యేక రాయితీలు కూడా వున్నాయి.

ముద్ర లోన్స్ ఏ సంస్థలు ఇస్తాయి?

  • ప్రభుత్వ రంగ బ్యాంకులు 

  • ప్రైవేటు బ్యాంకులు

  • గ్రామిన బ్యాంకులు

  • ప్రభుత్వ్ నిర్వహణ లోని సహకార బ్యాంకులు 

  • అలాగే మైక్రో ఫైనాన్సు బ్యాంకులు

  • స్మాల్ ఫైనాన్సు బ్యాంకులు 

  • ముద్ర లిమిటెడ్ ఆమోదించిన ఇతర సంస్థలు ఈ పథకం కింద రుణాలను మంజూరు చేస్తారు.

ముద్ర లోన్ ద్వార మనకు కలిగే లాభాలు:

  • ఎటువంటి తాకట్టు లేకుండా మీరు ముద్ర లోన్ పొందోచ్చు.

  • అలాగే ఈ లోన్ లకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం వుంటుంది

  • కావున మనకు తక్కువ వడ్డికే లోన్ దొరుకుతుంది అలాగే మనకు ఎంత కావాలో అంత లోన్ ఎటువంటి రిస్క్ లేకుండా షరతులు లేకుండా తిస్కోవచ్చు.

  • ఈ పథకం కింద లోన్ పొందడానికి ఎటువంటి థర్డ్ పార్టీ వ్యక్తులను నమ్మకుండా మీరు స్వయంగా మీ దగ్గరలో వుండే బ్యాంకు కు వెళ్లి అప్లై చేసుకోండి.

ముద్ర లోన్ కొరకు అప్లై చేయు పూర్తి ప్రాసెస్:

  • మీరు ఈ పథకం కింద లోన్ పొందాలి అంటే రెండు ఆప్షన్ లు అందుబాటులో వున్నాయి.అవి ఏంటంటే

  • మొదటి ఆప్షన్ లో బ్యాంకు లో నేరుగా వెళ్లి అప్లికేషన్ పూరించి అప్లై చేసుకోవచ్చు లేదా కింద చెప్పే ప్రాసెస్ లో అప్లై చేసుకోండి.

  • ముందుగా ముద్ర లోన్ యొక్క అధికారిక పోర్టల్ (https://udyamimitra.in/) గూగుల్ లో ఓపెన్ చేసుకోండి.

  • వెబ్సైటు ఓపెన్ చేశాక అందులో మనకు ముద్ర లోన్ ఆప్షన్ చూపిస్తుంది అక్కడ క్లిక్ చేసుకోండి.

  • అందులో మీరు కొత్తగా వ్యాపారం ప్రారంబిస్తుంటే New Entrepreneur ఆప్షన్ క్లిక్ చేసుకోండి.

  • లేదా అంతకు ముందే మీరు చేస్తున్నవ్యాపారం విస్తరిస్తుంటే Existing Entrepreneur ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.

  • తదుపరి మీకు ముద్ర లోన్ అప్లికేషను ఓపెన్ అవుతుంది.

  • అందులో దరఖాస్తుధారుడి పూర్తి పేరు మొబైల్ నెంబర్,ఈమెయిలు ఐడి వివరాలను నమోదు చేసి Otp ఆప్షన్ క్లిక్ చేసుకోండి.

  • తదుపరి అందులో మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటిపి ఎంటర్ చేసుకోండి.

  • ఇలా మీరు రిజిస్ట్రేషన్ అయ్యాక మీ వృతి పరమైన వివరాలు నమోదు చేసుకోండి.

  • ఆ తర్వాత మీ లోన్ అప్లికేషన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొండి(శిశు/కిశోర్/తరుణ్/) వాటిల్లో ఒకటి ఎంచుకోండి.

  • తదుపరి అక్కడ అడిగే పూర్తి సమాచారం నమోదు చేసుకోండి.

  • ఆ తర్వాత అక్కడ అడిగే అన్ని రకాల డాకుమెంట్స్ ని అందులో అప్లోడ్ చేసి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి.

  • ఇలా మీరు ముద్ర లోన్ కొరకు అప్లై చేసుకోవచ్చు.

  • అలాగే మీరు ఆన్లైన్ లో కాకుండా బ్యాంకు ద్వార ఈ ముద్ర లోన్ కొరకు అప్లై చేసుకోవాలి అనుకుంటే బ్యాంకు లో ఒక అప్లికేషను ఫారం వుంటుంది ఫిల్ చేసుకోవాలి.

  • అలాగే దానికి సరిపడా సపోర్టింగ్ డాకుమెంట్స్ అన్ని బ్యాంకు లో సబ్మిట్ చేసి అప్లై చేసుకోవచ్చు.

More Info:

  • బ్యాంకు లో మీరు ఈ ముద్ర యోజన కింద లోన్ తీస్కుంటే వారికి ముద్ర రూపీ కార్డు కూడా ఇస్తారు.

  • ఈ కార్డు మీ ముద్ర లోన్ ఎకౌంటు లో లింక్ అయ్యి వుంటుంది.

  • ఈ కార్డు ద్వార ముద్ర ఎకౌంటు నుంచి డబ్బులు విత్ డ్రా కూడా చేసుకోవచ్చు.దేశం లోని ఏ ఎటిఎం నుంచి అయిన డబ్బులు తిస్కోవచ్చు.

  • మనకు క్రెడిట్ హిస్టరీ కూడా క్రియాట్ అవుతుంది.

  • ఈ కార్డు మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది.

Read Also:

Pan Card : కొత్తగా పాన్ కార్డు కావాలా?కేవలం 2 నిమిషాల్లోనే అప్లై చేసుకోండి ఇలా!..

 

 

Author:

Web |  + posts

Ram Naik is the founder and content creator of Rammeesevatelugu.com. He is a Passionate content creator with over 4 years of experience, specializing in creating impactful and high quality content. He is a expertise in digital marketing, web designing and SEO strategies. He writes daily about online services, jobs notifications, and government schemes information in telugu. With a strong focus on public needs information. His ambition is to all types of useful information easily available to every reader in telugu

Leave a Comment