DRIVING LICENCE APPLY ONLINE:
-
కొత్త గా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి అంటే భారత ప్రభుత్వం కొత్త గా అందుబాటులోకి తీసుకొచ్చిన పరివాహన్ సేవ అనే వెబ్సైటు ద్వారా నే ఈ లైసెన్స్ సంబంధించి సర్వీసెస్ వుంటాయి.ఇండియా లో వున్నా అన్ని రాష్ట్రాల వారికి ఈ వెబ్సైటు లోనే డ్రైవింగ్ లైసెన్స్ ప్రాసెస్ వుంటుంది.ఇందులోనే పొందాలి.డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వుండాలి.లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే చట్ట పరంగా చర్యాలు ఎదురుకోవాల్సి వస్తుంది.ఫైన్ వుంటుంది.ఇందులో భాగం గా ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందాలి అనే పూర్తి వివరాలు కింద తెలియజేయడం జరిగింది.చూసి చేసుకోండి.
డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానం:
-
డ్రైవింగ్ లైసెన్స్ లో రెండు రకాలు వుంటాయి.అవి మొదటది Learner లైసెన్స్ ఇంకోటి డ్రైవింగ్ లైసెన్స్.
-
ఇందులో ముందుగా Learner లైసెన్స్ పొందాలి ఇది వచ్చాక డ్రైవింగ్ లైసెన్స్ కొరకు మల్లి అప్లై చేసుకోవాలి.డ్రైవింగ్ టెస్ట్ లో పాల్గొనాలి. ఆ తర్వాతే మనకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది.
-
ఈ పరివహన్ వెబ్సైటు లోనే Learner Licence అప్లై చెసుకొని మీ అడ్రస్ కి సంబదించి వుండే RTO ఆఫీస్ లో దీని కొరకు కంప్యూటర్ బేస్డ్ పరీక్షా వుంటుంది రాసి అందులో పాస్ అవ్వాలి.
-
ఆ తర్వాత Learner లైసెన్స్ వస్తుంది.ఇది వచ్చాక నెల రోజుల్లో మళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ కొరకు ఆ వెబ్సైటు లోనే అప్లై చేసుకోవాలి.
-
ఈ మొత్తం ప్రాసెస్ మనకు RTO ఆఫీస్ లోనే వుంటుంది.
-
అంతకు ముందే మీ దగర లైసెన్స్ వుండి దాన్ని రెన్యువల్ చేసుకోవాలి అంటే ఈ వెబ్సైటు లోనే చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు ఎంత వుంటుంది?
-
ఇందులో Learner లైసెన్స్ ఫిజు రూ.150 నుంచి 250RS మధ్యలో వుంటుంది.
-
అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఫీజు రూ.300 నుంచి 500/- మధ్యలో వుంటుంది.
-
ఈ ఫీజు అనేది మీరు ఎంచుకునే లైసెన్స్ క్లాస్ ని బట్టి వుంటుంది ఉదాహరణకు మీరు 2+4 ఒకేసారి అప్లై చేస్తే ఫీజు వేరేల వుంటుంది.ఆన్లైన్ అప్లై సమయం లో క్లియర్ గా చూపిస్తుంది.
-
అలాగే రెన్యువల్ కొరకు అయితే 300RS వరకు వుంటుంది.
లైసెన్స్ కొరకు ఉండాల్సిన అర్హతలు ఏంటి?
-
ప్రైవేటు వెహికల్ కొరకు అయితే ఆధార్ ప్రకారం 18 ఏళ్ళు నిండి వుండాలి.
-
వాణిజ్యo కొరకు అయితే 20 ఏళ్ళు నిండి వుండాలి.
-
లైసెన్స్ కు ముందు Learner పరీక్షా పాస్ అయ్యి వుండాలి.
-
అలాగే కచ్చితంగా దరఖాస్తుదారులకు ట్రాఫిక్ రూల్స్ అలాగే రోడ్డు గుర్తులపై అవగాహనా వుండాలి.
డ్రైవింగ్ లైసెన్స్ కొరకు కావలిసిన పత్రాలు ఏవి?
-
దరఖాస్తుదారు కచ్చితంగా ఆధార్ కార్డు కలిగి వుండాలి.ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ వుండాలి.
-
అలాగే పాస్పోర్ట్ సైజు ఫోటో వుండాలి.
-
అదే విధంగా సంతకం వుండాలి
-
అలాగే వయసు ప్రూఫ్ డాక్యుమెంట్ వుండాలి.
-
ఈ డాకుమెంట్స్ ని అప్లై సమయం లో అప్లోడ్ చెయ్యాలి.
డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చెయ్యు పూర్తి విధానం:
-
ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ సర్వీసెస్ కి సంబందించిన అధికారిక వెబ్సైటు పరివహన్ ఓపెన్ చేసుకోండి (వెబ్సైటు కొరకు ఇక్కడ నొక్కండి)
-
వెబ్సైటు ఓపెన్ చేశాక అక్కడ మనకు ఆన్లైన్ సర్వీసెస్ ఆప్షన్స్ లలో డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్ వుంటుంది.క్లిక్ చెయ్యండి.
-
ఆ తర్వాత అందులో డ్రైవర్స్ లేదా లెర్నింగ్ లైసెన్స్ ఆప్షన్ అందులో మీకు ఏది కావాలి క్లిక్ చెయ్యండి.
-
ఆ తర్వాత మీరు ఏ రాష్ట్రము చెందిన వారో సెలెక్ట్ చేసుకోండి.(ఆ రాష్ట్రాల లిస్టు లో తెలంగాణా ఉండదు.అది సెపరేట్ సైట్ వుంది)
-
ఆ తర్వాత పేజిలో లైసెన్స్ యొక్క ఆన్లైన్ అప్లికేషను ఓపెన్ అవుతుంది.
-
తదుపరి అందులో చూపించే వివరాలు నింపండి.మీ ఆధర్ వివరాలు, ఆధర్ ఒటిపి ప్రాసెస్,వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకోండి.
-
అలాగే అందులో అడిగే సంబంధిత పత్రాలు అప్లోడ్ చెయ్యండి.
-
ఆ తర్వాత పేజిలో పేమెంట్ ఆప్షన్ ద్వారా ఆక్కడ చూపించే డబ్బులు మీ యుపిఐ యాప్ ద్వారా పూర్తి చేయండి.ఆ తర్వాత అప్లికేషను సబ్మిట్ చెయ్యండి.
-
ఇలా మీరు అప్లికేషను పూర్తి చేశాక అప్లికేషను ఫారం చూపిస్తుంది సేవ్ చేసుకోండి.
-
అలాగే అప్లికేషను కంప్లీట్ అయ్యాక లెర్నింగ్ లైసెన్స్ చేసింటే పరీక్షా తేది బుక్ చేసుకోండి.డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుక్ చేసుకోండి.
-
మీరు బుక్ చేసిన తేదికి RTO ఆఫీస్ లో అటెండ్ అవ్వాలి ఇది చూశాక ఆఫీస్ మీ లైసెన్స్ టెస్ట్ పాస్ అయ్యాక మీ ఒరిజినల్ లైసెన్స్ పోస్ట్ ద్వారా వస్తుంది.లేదా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆఫ్ లైన్ ద్వారా ఎలా అప్లై చెయ్యాలి?
-
ముందుగా మీ అడ్రస్ నియర్ RTO ఆఫీస్ వెళ్లి ఫారం-4 తీస్కోవాలి.ఆ అప్లికేషను ఫారం ఫిల్ చెయ్యండి.
-
డాకుమెంట్స్ అక్కడ సమర్పించండి.ఫీజు చెల్లించండి.తేది యొక్క స్లాట్ బుక్ చేయించుకోండి.
-
ఆ తర్వాత ఆ తేదికి RTO ఆఫీస్ లో హాజరు అయ్యి మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి.టెస్ట్ లో పాస్ అయితే లైసెన్స్ మంజూరు అవుతుంది.
గమనిక: డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి ఇంకా ఏవైనా సందేహాలు వుంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
Read Also :
ఆధార్ కొత్త ఆప్షన్ వచ్చేసింది? ఇక నుంచి ఇంట్లో కూర్చొని మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి..ఇలా
Author:
Ram Naik is the founder and content creator of Rammeesevatelugu.com. He is a Passionate content creator with over 4 years of experience, specializing in creating impactful and high quality content. He is a expertise in digital marketing, web designing and SEO strategies. He writes daily about online services, jobs notifications, and government schemes information in telugu. With a strong focus on public needs information. His ambition is to all types of useful information easily available to every reader in telugu