ఆధార్ కార్డులో అడ్రస్ మీ మొబైల్ లోనే ఈజీ గా మార్చుకోండి… సింపుల్ ప్రాసెస్.

aadhar card address update process in telugu new process

పరిచయం: మన ఆధార్ కార్డు లో అడ్రస్ మార్చుకోవాలి అంటే ఆధర్ సెంటర్ కి పోవాల్సిన అవసరం లేకుండా మనమే సొంతంగా మన మొబైల్ లోనే ఆధార్ అడ్రస్ సులభంగా చేసుకోవచ్చు. ఇందుకు మనం ఆధార్ వెబ్సైటు ఓపెన్ చేసుకోవాలి.ప్రాసెస్ చేసే సమయం లో అడ్రస్ అప్డేట్ కు సరిపడా డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఆన్లైన్ ఫీజు 75RS పే చేసి చేసుకోవాలి.పూర్తి ప్రాసెస్ స్టెప్స్ ప్రకారం కింద వివరంగా తెలియజేయడం జరిగింది.

Note:

  • ఈ ప్రాసెస్ మీరు చేయాలి అంటే కచితంగా మీ ఆధర్ కార్డు కు మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి.
  • మీరు ఈ ప్రాసెస్ కి కేవలం 75RS మాత్రమే చెల్లించాలి.
  • ఈ ప్రాసెస్ లో కేవలం ఆధార్ అడ్రస్ మాత్రమే మనం చేసుకోవడానికి వస్తుంది.అలాగే మీరు ఆధార్ లో పేరు లేదా పుట్టిన తేది మార్చాలి అంటే కచితంగా ఆధర్ సెంటర్ లోనే ప్రాసెస్  అవుతుంది
  • మీరు ఆధార్ అడ్రస్ అప్డేట్ ప్రాసెస్ చేశాక ఒక రిసిప్ట్ వస్తుంది.ఈ ప్రాసెస్ మాక్సిమం 30 రోజులలోపు అప్రువ్ అవుతుంది.

ఆధార్ అడ్రస్ అప్డేట్ కొరకు కావలిసిన డాకుమెంట్స్ :

  • ఇక్కడ కింద ఇవ్వబడిన డాక్యుమెంట్ లలో ఏదో ఒక డాక్యుమెంట్ వుంటే ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు.
  • రేషన్ కార్డు
  • బ్యాంకు పాస్ బుక్
  • వోటర్ ఐ డి కార్డు
  • కరెంటు బిల్
  • లేబర్ కార్డు
  • ఉపాధి హామీ పథకం కార్డు
  • గ్యాస్ కనెక్షన్ బిల్
  • ఆస్తి పన్ను రసీదు
  • ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్
  • లైఫ్ సర్టిఫికేట్
  • ఇన్సురన్సు పాలసీ
  • మ్యారేజ్ సర్టిఫికేట్
  • దివ్యంగుల కార్డు
  • పైన తెలిపిన డాకుమెంట్స్ లేకపోతే ఆధార్ సంబదించి ఒక ఫారం వుంటుంది అది ఫిల్ చేసి అందులో ఫోటో ను అతికించి  గెజిట్ అధికారి యొక్క సంతకం చేసిన ఫారం వున్నా కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు.
  • ప్రాసెస్ చేసే ఆపుడు డాక్యుమెంట్ అప్లోడ్ సమయం లో ఒరిజినల్ డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వుంటుంది.

 WEBSITE LINK : (CLICK HERE)

ఆధార్ అడ్రస్ అప్డేట్ పూర్తి విధానం:

Step1 :

  • ముందుగా ఆధార్ అధికారిక వెబ్సైటు uidai.gov.in ఓపెన్ చేసుకోండి.
  • ఆ తర్వాత అక్కడ ఆధార్ సైట్ లో మీకు లాగ్ ఇన్ అవ్వమని చూపిస్తుంది లాగ్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి.

Step2 :

  • ఆ తర్వాత అక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ మరియు కాప్చ ఎంటర్ చేసి గెట్ ఓటిపి ఆప్షన్ క్లిక్ చెయ్యండి.
  • తర్వాత ఆధార్ లింక్ నెంబర్ కి ఓ టిపి వస్తుంది.అది అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చెయ్యండి.వెబ్సైటు లాగ్ ఇన్ ఓపెన్ అవుతుంది.

Step3 :

  • లాగ్ ఇన్ అయ్యాకా అక్కడ మీకు ‘Address Update” ఆప్షన్ వుంటుంది అది క్లిక్ చెయ్యండి.
  • ఆ తర్వాత అక్కడ “Update address using your Documents’ అనే ఆప్షన్ వుంటుంది అది క్లిక్ చేసుకోండి.

Step4 :

  • ఆ తర్వాత పేజిలో అడ్రస్ అప్డేట్ సంబంధించి ఆప్షన్ టిక్ చేసి వుంటుంది.అలాగే కింద వున్నా ‘Proceed to update Aadhar’ ఆప్షన్ క్లిక్ చెయ్యండి.
  • ఆ తర్వాత అప్లికేషను ఫారం ఓపెన్ అవుతుంది.అక్కడ ప్రస్తుతం ఆధార్ లో వున్నా అడ్రస్ చూపిస్తుంది.అలాగే కింద మనం అప్డేట్ చేయాలి అనుకుంటున్నా అడ్రస్ ఎంటర్ చేయమని చూపిస్తుంది.
  • అందులో మీ ఇంటి నెంబర్ మరియు వీధి అలాగే ల్యాండ్ మార్క్ మరియు పిన్ కోడ్ అలాగే మండలం,జిల్లా,స్టేట్ ఎంటర్ చేసుకోండి.
  • అలాగే కింద డాక్యుమెంట్ అప్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది.అక్కడ ‘Manual Upload’ ఆప్షన్ క్లిక్ చేసి
  • కింద “Select Supporting Valid Documents Type”దగర క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాలి అనుకుంటున్నా డాక్యుమెంట్ ఏంటో అది సెలెక్ట్ చేసుకోండి.
  • నెక్స్ట్  పక్కనే ‘Upload Supporting Document”ఆప్షన్ దగర మీ డాక్యుమెంట్ ని క్లిక్ చేసి అప్లోడ్ చేసేయండి.
  • డాక్యుమెంట్ అప్లోడ్ సైజు 2MB లోపే ఉండాలి అలాగే JPEG,PNG,PDF లలో మాత్రమే డాక్యుమెంట్ అప్లోడ్ చెయ్యండి.
  • ప్రాసెస్ చేశాక కింద కుడి వైపు Next అనే ఆప్షన్ క్లిక్ చెయ్యండి.

Step5 :

  • ఆ తర్వాత పేజిలో “Preview” చూపిస్తుంది మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ మళ్ళి ఒకసారి కరెక్ట్ గా ఎంటర్ చేశారో లేదో చెక్ చేసుకోండి.
  • ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి చివరిగా పేమెంట్ ఆప్షన్ లోకి వెళ్ళండి.అక్కడ UPI ద్వార 75 RS పేమెంట్ చేసేయండి.
  • ఈ ప్రాసెస్ మీరు పూర్తి చేశాక చివరిలో మీకు ఒక రిసిప్ట్ SRN నెంబర్ తో వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి.
  • ఇలా మీరు ప్రాసెస్ పూర్తి చేశాక ఒక 15 లేదా 30 రోజులలోపు అడ్రస్ అప్డేట్ అయ్యాకా మెసేజ్ వస్తుంది ఆ తర్వాత మీరు ఆ అప్డేట్ అయిన ఆధార్ ను వెబ్సైటు లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • అలాగే ఈ ప్రాసెస్ సంబంధించి అప్డేట్ అయిందో లేదో ఎప్పటికి ఆపుడు ఆ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.
  • అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం

ఆధార్ అడ్రస్ అప్డేట్ అయిందో లేదో  స్టేటస్ తెలుసుకునే విధానం:

  • మీరు ఆధార్ అడ్రస్ ప్రాసెస్ పూర్తి చేశాక వెబ్సైటు అయితే లాగ్ అవుట్ అవ్వండి.
  • అదే ఆధార్ వెబ్సైటు లోనే ‘Update Aadhar’ ఆప్షన్స్ లలో “check Aadhar Update Status’ అనే ఆప్షన్ క్లిక్ చెయ్యండి.
  • ఆ తర్వాత పేజిలో ఎన్రోల్ల్మేంట్ ఐడి మరియు SRN అనే ఆప్షన్ వుంటాయి అందులో SRN ఆప్షన్ సెలెక్ట్ చేసి
  • ఆ తర్వాత మీరు ఆధార్ అడ్రస్ అప్డేట్ ప్రాసెస్ చేశాక మీకు ఒక రిసిప్ట్ వచింటుంది అందులో మనకు SRN అని సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ వుంటుంది ఆ నెంబర్ ను అక్కడ ఎంటర్ చేసి కింద ఆ కాప్త్చ్ ఫిల్ చేసి Submit ఆప్షన్ క్లిక్ చెయ్యండి.
  • ఇలా చేశాక ఆ తర్వాత పేజిలో మీరు ప్రాసెస్ చేసినది Approve అయ్యిందా లేదా Pending వుందా అనేది స్టేటస్ చూపిస్తుంది.ఇలా చెక్ చేసుకోవచ్చు.

More Info:

  • ఇప్పుడు మనమే సొంతంగా ఈ ఆధార్ అడ్రస్ ప్రాసెస్ చేసిన విధంగా త్వరలోనే ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకునే ఆప్షన్ కూడా ఆధార్ వెబ్సైటు లో వచ్చే అవకాశం వుంది అని సమాచారం అయితే వచ్చింది త్వరలోనే దీనికి సంబంధించి అప్డేట్ రావొచ్చు.
  • మీరు ఆధార్ లో పుట్టిన తేది మార్చుకోవాలి అంటే మీ ధగర్లో వుండే ఆధార్ సెంటర్ లో దానికి సంబదించిన డాక్యుమెంట్ ద్వార పుట్టిన తేది మార్చుకోవచ్చు.
  • అలాగే చిన్న పిల్లలకు కొత్త గా ఆధార్ కార్డు పొందాలి అంటే ఆధార్ సెంటర్ లోనే చేసుకోవాలి.
  • మీ దగర వుండే ఆధర్ మిస్ అయ్యింటే మరల ఒరిజినల్ కార్డు ను ఆధార వెబ్సైటు లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఆధార్ లో పుట్టిన తేది మార్చుకోడానికి కావాల్సిన డాకుమెంట్స్ :

  • పదవ తరగతి ఒరిజినల్ మార్క్స్ మేమో లేదా
  • పుట్టిన తేది ఒరిజినల్ సర్టిఫికేట్ లేదా
  • పాస్పోర్ట్
  • పాన్ కార్డు
  • వీటిలో ఏదో ఒక ప్రూఫ్ వుంటే మార్చుకోవచ్చు.

కొత్తగా ఆధార్ అప్లై చెయ్యాలి అంటే కావాల్సిన డాకుమెంట్స్& ప్రాసెస్ :

  • చిన్న పిల్లలకు కొత్తగా ఆధార్  కొరకు అయితే వారి యొక్క  పుట్టిన తేది సర్టిఫికేట్ మరియు అమ్మ లేదా నాన్న యొక్క ఆధార్ ఉండాలి.
  • అలాగే కొంచం పెద్ద వారికి అయితే పుట్టిన తేది సర్టిఫికేట్ లేకపోతే పదవ తరగతి ఒరిజినల్ మార్క్స్ మేమో వుంటే అప్లై చేసుకోవచ్చు.
  • అలాగే మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ ఉండాలి అలాగే బయోమెట్రిక్ ప్రాసెస్ చెయ్యల్సివుంటుంది.
  • మీరు కొత్తగా ఆధార్ అప్లై చేశాక 15 లేదా 30 రోజుల లోపు కొత్త ఆధార వస్తుంది.ఆ ఆధార ను వెబ్సైటు లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.పోస్ట్ ద్వార కూడా ఒరిజినల్ ఆధార్ వస్తుంది.

ఆధార్ డౌన్లోడ్ ప్రాసెస్ ఆన్లైన్:

  • ముందుగా ఆధార్ వెబ్సైటు ఓపెన్ చేసుకోండి.
  • ఆ తర్వాత అక్కడ Get Aadhar ఆప్షన్స్ లలో డౌన్లోడ్ ఆధార్ ఆప్షన్ వుంటుంది.ఆ ఆప్షన్ క్లిక్ చెయ్యండి.
  • ఆ తర్వాత పేజిలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద కాప్త్చ ఎంటర్ చేసి “Send Otp’ ఆప్షన్ క్లిక్ చెయ్యండి.
  • ఆధార్ లింక్ నెంబర్ కి ఒటిపి వస్తుంది అది అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చెయ్యండి ఆ తర్వాత ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుంది.

READ ALSO: Train Ticket Booking: ఈ యాప్ లో రెండు నిమిషాల్లోనే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..

Author:

Web |  + posts

Ram Naik is the founder and content creator of Rammeesevatelugu.com. He is a Passionate content creator with over 4 years of experience, specializing in creating impactful and high quality content. He is a expertise in digital marketing, web designing and SEO strategies. He writes daily about online services, jobs notifications, and government schemes information in telugu. With a strong focus on public needs information. His ambition is to all types of useful information easily available to every reader in telugu

Leave a Comment