SBI Personal Loan: ఎస్బిఐ లో ఈజీ గా 10 లక్షల వరకు లోన్ పొందండి.ప్రతి ఒక్కరికి ఇస్తారు.ఇలా అప్లై చేసుకోండి.

SBI PERSONAL LOAN: మీరు పర్సనల్ లోన్ పొందాలి అనుకుంటే ఎస్బిఐ లో చాలా సులభంగా 50 వేల నుంచి 50 లక్షల వరకు personal loan ఇస్తారు. అది కూడా తక్కువ వడ్డీ కే ఇస్తున్నారు. మనమే సొంతంగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.ఈ లోన్ కొరకు వారు పెట్టిన అర్హతలు మ్యాచ్ అయిన వారికి లోన్ అప్రూవల్ అనేది వస్తుంది.ఈ personal loan శాలరీ ఎకౌంటు ఎస్బిఐ లో వుండి నెల వారి శాలరీ వస్తున్న వారికి ఇస్తున్నారు.ఇందులో భాగంగా ఈ పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి,కావాల్సిన పత్రాలు ఏంటి,అర్హతలు ఏంటి అనే పూర్తి సమాచారం కింద వివరంగా తెలియజేయడం జరిగింది.తెలుసుకొని అప్లై చేసుకోండి.

Note Points:

  • ఎస్బి ఐ లో personal లోన్ పొందాలి అంటే ఎస్బి ఐ బ్యాంకు లో శాలరీ ఎకౌంటు కలిగి వుండాలి.
  • అలాగే నెలవారీ జీతం శాలరీ ఎకౌంటు లో క్రెడిట్ అవుతూ వుండాలి.
  • ఈ పర్సనల్ లోన్ ద్వారా 50 లక్షల వరకు లోన్ పొందొచ్చు.
  • ఈ లోన్ కొరకు ఎస్బి ఐ యొక్క అధికారిక సైట్ లో మనమే సొంతం గా అప్లై చేసుకోవచ్చు.
  • ఈ personal లోన్ పొందాలి అంటే సిబిల్ స్కోర్ బాగా వుండాలి.
  • ఈ లోన్ ప్రాసెస్ కొరకు ఆధర్ మరియు పాన్ కార్డు తప్పకుండా వుండాలి.
  • ఈ personal లోన్ వడ్డీ రేటు 10.0 నుంచి 15 శాతం లోపు వుంటుంది.
  • లోన్ మంజూరు విషయం లో తక్కువ ప్రాసెసింగ్ ఫీజు వుంటుంది.
  • లోన్ పొందిన తరువాత మీరు ఎంచుకున్న EMI ప్రకారం నెల నెల ఎకౌంటు ద్వారా చెల్లించాలి.
  • లోన్ చెల్లించే కాల పరిమితి 6 నెలల నుంచి 72 నెలల వరకు వుంటుంది.

ఈ Personal Loan పొందాలి అంటే ఉండాల్సిన అర్హతలు:

  • ఇండియా కి చెందిన వారు అయ్యి వుండాలి.
  • ఎస్బి ఐ బ్యాంకు లో తప్పకుండా శాలరీ ఎకౌంటు కలిగి వుండాలి.
  • గవర్నమెంట్ లేదా ప్రైవేటు లో జాబ్ చేస్తున్న వారు అర్హులు.
  • నెల వారి జీతం శాలరీ ఎకౌంటు లోనే క్రెడిట్ అవుతూ వుండాలి.
  •  ప్రైవేటు సెక్టార్ లో జాబ్ చేస్తున్న ఉద్యోగులు కనీసం ఒక 12 నెలల సర్వీస్ పూర్తి చేసి వుండాలి.
  • అలాగే గవర్నమెంట్ సెక్టార్ లో చేస్తున్న వారు మినిమం 6 నెలల సర్వీస్ పూర్తి చెయ్యాలి.
  • అలాగే వయసు 21 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపు వుండాలి.
  • ప్రైవేటు జాబ్ చేస్తున్న వారి నెల జీతం మినిమం Rs25000  వుండాలి.
  • అలాగే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారి నెల జీతం కనీసం Rs20000 వుండాలి.
  • అదే విధంగా లోన్ పొందాలి అంటే తప్పకుండా క్రెడిట్ స్కోర్ 650 పైన వుండాలి.
  • ఈ personal లోన్ కింద మినిమం 1 లక్ష నుంచి 50 లక్షల వరకు ఇస్తారు.ఇది మీ నెల శాలరీ మరియు సిబిల్ స్కోర్ మిద ఆధారపడి వుంటుంది.

కావలిసిన పత్రాలు:

  1. ఆధార్ మరియు పాన్ కార్డు తప్పనిసరిగా వుండాలి.
  2. గత 3 నుంచి 6 నెలల జాబ్ యొక్క salary స్లీప్ లు వుండాలి.
  3. అలాగే గత ఆరు నెలల బ్యాంకు ఎకౌంటు స్టేట్మెంట్ వుండాలి.
  4. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు ఫొటోస్ వుండాలి.
  5. ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ వుండాలి.

ఎస్బి ఐ Personal Loan ఆన్లైన్ ద్వారా అప్లై చేయు విధానము:

  1. ముందుగా ఎస్బిఐ పర్సనల్ లోన్ యొక్క అధికారిక వెబ్సైటు ఓపెన్ చేసుకోండి.(లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి)
  2. వెబ్సైటు ఓపెన్ అయ్యాక అందులో ఎస్బిఐ పర్సనల్ లోన్ salary ఎంప్లాయిస్ అనే ఆప్షన్ వుంటుంది క్లిక్ చెయ్యండి.
  3. తదుపరి పేజిలో ఎస్బిఐ పర్సనల్ లోన్ ఆన్లైన్ అప్లికేషను ఓపెన్ అవుతుంది.
  4. అప్లై ప్రాసెస్ లో 3 స్టెప్స్ వుంటాయి అందులో ముందుగా లోన్ ఎలిజబులిటి చెక్ చేస్తారు.ఆ తర్వాత లోన్ ఆఫర్ చేస్తారు.నెక్స్ట్ ప్రాసెస్ లో అప్లై ప్రాసెస్ పూర్తి అవుతుంది.
  5. ముందుగా మొదటి స్టెప్ లో Purpose of Loan ఆప్షన్ లో లోన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
  6. అలాగే కింద Type of Relationship ఎంపిక చేసుకోండి.అలాగే మీ ఎకౌంటు నెంబర్ నమోదు చేసుకోండి.అలాగే కింద మీ ఎకౌంటు మరియు ఆధర్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ నమోదు చేసుకోండి.
  7. ఇలా మొదటి స్టెప్ లో మీ వివరాలు నమోదు చేశాక కింద వుండే సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చెయ్యండి.
  8. ఆ తర్వాత పేజిలో మీ మొబైల్ నెంబర్ కి ఒటిపి వస్తుంది అది అక్కడ ఎంటర్ చెయ్యండి.అలాగే మీ మెయిల్ ఐడి నమోదు చెయ్యండి.
  9. తదుపరి పేజిలో అప్లికేషను ఫారం ఓపెన్ అవుతుంది.అందులో మీ వివరాలు నమోదు చేయాలి.
  10. అందులో మీ ఆదాయ వివరాలు మరియు వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి.
  11. అలాగే మీ పాన్ కార్డు నెంబర్ వివరాలు మరియు మీ జాబ్ యొక్క వివరాలు మరియు కాంటాక్ట్ డీటెయిల్స్ నమోదు చెయ్యాలి.
  12. ఇలా వివరాలు ఎంటర్ చేశాక కింద Get Loan Quote ఆప్షన్ క్లిక్ చెయ్యండి.
  13. తదుపరి పేజిలో మీరు ఈ personal లోన్ కి అర్హత పొంది వుంటే ఎంత లోన్ ఎలిజబుల్ అయ్యారో ఆక్కడ మీకు చూపిస్తుంది.
  14. ఆ తర్వాత పేజిలో డాకుమెంట్స్ అప్లోడ్ చెయ్యాల్సి వుంటుంది.
  15. మీ బ్యాంకు ఎకౌంటు స్టేట్మెంట్ మరియు salary స్లిప్స్ అందులో అప్లోడ్ చెయ్యాల్సి వుంటుంది.
  16. ఇలా ప్రాసెస్ పూర్తి చేశాక అప్లికేషను సబ్మిట్ చేసుకోండి.ఆ తర్వాత 24 గంటల్లో మీ లోన్ వెరిఫికేషన్ పూర్తి చేశాక  లోన్ అమౌంట్ క్రెడిట్ చెయ్యడం జరుగుతుంది.

More Info:

  • ఈ ఎస్బిఐ పర్సనల్ లోన్ అప్లై చేసుకోవాలి అనుకుంటే పైన చెప్పిన ప్రాసెస్ కాకుండా ఎస్బి ఐ సంబంధించి యోనో యాప్ ద్వారా కూడా చాలా సులభంగా అప్లై చేసుకోవచ్చు.
  • యోనో యాప్ ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేసుకొని యాప్ లో ముందు రిజిస్టర్ అయ్యి లాగ్ ఇన్ అయ్యాక లోన్ ఆప్షన్స్ లలో లోన్ అప్లికేషను ప్రాసెస్ చేసుకోవచ్చు

 

Read Also:

Train Ticket Booking: కొత్త రైల్వే యాప్ వచ్చింది.ఇందులో 2 నిమిషాల్లోనే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు ll ఇలా చేసుకోండి..

 

 

Author:

Web |  + posts

Ram Naik is the founder and content creator of Rammeesevatelugu.com. He is a Passionate content creator with over 4 years of experience, specializing in creating impactful and high quality content. He is a expertise in digital marketing, web designing and SEO strategies. He writes daily about online services, jobs notifications, and government schemes information in telugu. With a strong focus on public needs information. His ambition is to all types of useful information easily available to every reader in telugu

Leave a Comment