Sukanya Samriddhi Yojana Scheme Telugu:
-
కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల సంరక్షణ కొరకు ఎన్నో రకాల పతకాలను అమలు చేస్తూ వస్తుంది.ఇందులో భాగంగానే ఆడపిల్ల చదువుకు అలాగే వివాహానికి ఉపయోగపడేలా అలోచించి ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీం ను ప్రారంబించడం జరిగింది.ఇందులో మనం పుట్టిన ఆడపిల్లల పేరు మిద ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఖాతా తెరిచి నెల నెల లేదా ఏడాదికి ఒకసారి ఈ పథకం లో డబ్మబు జమ చేసి చేరొచ్చు. ఇందులో మనం నిర్ణయించుకున్న మొతాన్ని డిపాజిట్ చేస్తూ వస్తే ఆలా ఆడపిల్లకి 21 ఏళ్ళు వచ్చాక ఆ మొత్తం డబ్బులు అలాగే అధిక వడ్డీ తో పాటు అలాగే ఎటువంటి టాక్స్ కటింగ్ లేకుండా పూర్తి మొతాన్ని ఈ పథకం కింద అదివ్వడం జరుగుతుంది.కావున ఈ పథకం అర్హతలు ఏంటి,ఎలా అప్లై చెయ్యాలి?కావలిసిన డాకుమెంట్స్ ఏంటి అనే పూర్తి వివరాలు కింద వివరంగా తెలుసుకుందాం.
ముఖ్యాంశాలు:
-
ఈ పథకం పూర్తిగా ఆడ పిల్లలకు చెందినది.
-
ఆడ పిల్ల పుట్టిన వెంటనే వారి పేరు మిద ఈ పథకం లో చేరొచ్చు.
-
ఈ పథకం లో చేరాక ప్రతి నెల లేదా ఏడాదికి ఒకసారి మనకు తోచినంత ఎంత డబ్బు అయిన జమ చెయ్యొచ్చు.
-
ఈ పథకంలో చేరాక 15 ఏళ్ళ వరకు కొనసాగాలి ఆ తర్వాత ఆడ పిల్లకు 21 ఏళ్ళు నిండిన తర్వాత ఆ డబ్బు మొత్తం ఇస్తారు.
-
ఈ పథకం లో వడ్డీ గరిష్టంగా 8 నుంచి 9 శాతం వరకు వుంటుంది.మిగతా పథకాలతో పోలిస్తే ఇదే ఉత్తమం.
-
ఈ పథకం లో చేరాలంటే మీకు ధగర్లోని పోస్ట్ ఆఫీస్ లలో లేదా బ్యాంకు లో అయిన స్కీం కింద ఎకౌంటు ఓపెన్ చెయ్యొచ్చు.
-
ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ హామీతో కూడిన పథకం కాబట్టి ఎటువంటి రిస్క్ అనేది వుండదు.
ఈ పథకానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి?
-
భారతీయ పౌరులు అయ్యి వుండాలి.
-
ఒక కుటుంబం లో ఇద్దరు ఆడ పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.
-
ఆడ పిల్ల పుట్టినపట్టి నుంచి 10 ఏళ్ళ లోపు మాత్రమే ఈ పథకంలో చేరడానికి కుదురుతుంది.
-
పేద,మధ్య తరగతి కుటుంబాలకు ఈ పథకం ఒక వరం లాంటిది.
-
ఈ పథకం లో ప్రభుత్వ ఉద్యోగులు అలాగే టాక్స్ కట్టే వారు అయిన అందరు అర్హులే అవుతారు.
ఈ పథకానికి కావలిసిన పత్రాలు:
-
ముఖ్యంగా ఆడ పిల్ల యొక్క పుట్టిన తేది సర్టిఫికేట్ తప్పనిసారిగా వుండాలి.
-
అలాగే తల్లితండ్రులు లేదా సంరక్షకుల ఆధార్ కార్డు వుండాలి.
-
భాలిక మరియు తల్లి తండ్రుల యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటోలు వుండాలి.
-
అలాగే సుకన్య సమృద్ధి యోజన యొక్క అప్లికేషను ఫారం వుండాలి.
-
ఈ డాకుమెంట్స్ తీస్కొని మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లో లేదా ఎస్బిఐ బ్యాంకు లో ఈ పథకం లో చేరండి.
ఎలా అప్లై చెయ్యాలి?
-
ఈ సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఆన్లైన్ లో ఓపెన్ చేసుకోడానికి లేదు.
-
ఈ ఖాతాను మీకు దగ్గరలోని బ్యాంకు లో లేదా పోస్ట్ ఆఫీస్ లో మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు
-
ఈ పథకం యొక్క అప్లికేషను ఫారం డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ పూరించి అవసరమయ్యే డాకుమెంట్స్ జత చేసి బ్యాంకు లో లేదా పోస్ట్ ఆఫీస్ లో సబ్మిట్ చెయ్యాల్సి వుంటుంది.
-
ఖాతా ఓపెన్ చేశాక ఆన్లైన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు.
-
ఈ పథకం లో ప్రతి నెల లేదా ఏడాదికి ఒకసారి డబ్బు జమ చెయ్యవచ్చు.
ఈ పథకం లో ఎప్పటి వరకు డబ్బు జమ చెయ్యాలి?21 ఏళ్ళు వరకు జమ చేస్తే ఎంత ఇస్తారు?
-
మీరు నెల నెల లేదా ఏడాదికి ఎంత జమ చేస్తారో దాన్ని బట్టి మీకు వచ్చే డబ్బు ఆధారపడి వుంటుంది.
-
ఉదాహరణకు మీరు ప్రతి నెల 5000 జమ చేస్తే 21 ఏళ్ళ తర్వాత మీకు వడ్డీ తో కలిపి దాదాపుగా మీకు 25 లక్షల వరకు వస్తుంది.
-
మీరు ఈ పథకంలో చేరిన తరువాత 15 ఏళ్ళ వరకు డబ్బు జమ చేస్తూ రావాలి.
-
తప్పకుండా 15 ఏళ్ళ పాటు డబ్బు జమ చెయ్యాలి ఈ తరువాత జమ చేయాల్సిన అవసరం లేదు వడ్డీ వస్తూనే వుంటుంది.
ఈ పథకం లో చేరిన తరువాత డబ్బు ఎప్పుడు తీసుకోవాలి?నియమాలు ఏంటి.
-
ఈ ఖాతా మేచ్యురిటి 21 ఏళ్ళ వరకు వుంటుంది.ఆ తర్వాత మీ డబ్బు మొత్తం వడ్డీ తో పాటు ఇస్తారు.
-
ఒకవేళ అమ్మాయి ఉన్నత విద్య కోసం అయితే 18 ఏళ్ళ తర్వాత 50 శాతం తిస్కోవచ్చు.ఇందుకు గాను ఎడ్యుకేషన్ సంబందించిన డాకుమెంట్స్ సబ్మిట్ చెయ్యాలి.
-
ఒకవేళ ఈ ఖాతాను క్లోజ్ చేసుకోవాలి అంటే కొన్ని రూల్స్ వుంటాయి.
-
అమ్మాయి వయసు 18 ఏళ్ళ అంతకంటే ఎక్కువ వుంటే ఈ స్కీం క్లోజ్ చేసుకోవచ్చు.
-
అలాగే అమ్మాయికి వివాహం జరిగి వుంటే కూడా ఈ స్కీం క్లోజ్ చేసుకోవచ్చు.
-
ఒకవేళ ఈ పథకం మధ్యలో భాలిక మరణిస్తే ఆ డబ్బు మొత్తం వడ్డీ తో పాటు తల్లి తండ్రుల ఖాతాల్లో జమ చేస్తారు.
-
ఇంకా ఈ పథకం గురించి పూర్తి వివరాలకు మీ దగ్గర లోని బ్యాంకు ని సంప్రదించండి.
సుకన్య సమృద్ధి యోజనా ఖాతా తెరవడానికి ప్రధాన బ్యాంకులు ఇవే.
-
ఈ పథకం కింద ఖాతాను దేశంలోని ప్రధాన బ్యాంకులలో SBI,ICICI,AXIS BANK,HDFC,BANK OF BARODA,PNB బ్యాంకు లలో ఓపెన్ చేసుకోవచ్చు.
-
ఆన్లైన్ లో ఖాతా తెరవడానికి అవకాశం లేదు.కేవలం ఆఫ్ లైన్ లోనే బ్యాంకు లో సంప్రదించి ఖాతా తెరవాలి.
ఈ పథకం ఇన్స్టాల్ మెంట్ ను ఆన్లైన్ లో చెల్లించోచ్చా ?
-
ఈ పథకం లో ఖాతా ను బ్యాంకు లో ఓపెన్ చేసింటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా బ్యాంకు యొక్క మొబైల్ యాప్ ద్వారా డబ్బు పే చేయొచ్చు.
-
అదే పోస్ట్ ఆఫీస్ లో ఖాతా తెరిచింటే ఆన్లైన్ లో IPPB లో ఖాతా ఉన్నట్లయితే ఆ యాప్ లాగ్ ఇన్ అయ్యి డబ్బు లు నెల నెల కట్టొచ్చు.స్టేట్ మెంట్ కూడా చూసుకోవచ్చు.
గమనిక: ఈ పథకం సంబంధించి ఏవైనా సందేహాలు వుంటే కింద కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి.
READ ALSO:
Pm Awas Yojana scheme ll ఇంటి నిర్మాణానికి ౩ లక్షలు ఇస్తున్నారు ll వెంటనే ఇలా అప్లై చేసుకోండి ll అర్హతలివే
AUTHOR:
Ram Naik is the founder and content creator of Rammeesevatelugu.com. He is a Passionate content creator with over 4 years of experience, specializing in creating impactful and high quality content. He is a expertise in digital marketing, web designing and SEO strategies. He writes daily about online services, jobs notifications, and government schemes information in telugu. With a strong focus on public needs information. His ambition is to all types of useful information easily available to every reader in telugu