PF Withdrawal: UMANG యాప్ ద్వారా ఇంట్లో కూర్చొని 2 నిమిషాల్లో ఈజీగా క్లెయిమ్ చేసుకోండి ఇలా..

PF Withdrawal Online:

  • మీ పియఫ్ ఎకౌంటు లో డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి అనుకుంటుంటే UMANG యాప్ ద్వారా చాలా సులభంగా 2 నిమిషాల్లో క్లెయిమ్ చేసుకోవచ్చు.ఈ యాప్ మన మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకొని ప్రాసెస్ చేసుకోవచ్చు.ఈ యాప్ ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.ఇందుకు గాను ముందుగా ఈ యాప్ లో ముందుగా పియఫ్ హోల్డర్ పియఫ్ డీటెయిల్స్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి.అది ఎలానో కింద వివరంగా తెలుసుకుందాం.ఈ యాప్ లో మనం పియఫ్ కి సంబదించి పియఫ్ క్లెయిమ్ అలాగే పెన్షన్ క్లెయిమ్ మరియు పియఫ్ బాలన్స్ అలాగే క్లెయిమ్ స్టేటస్ చూసుకోవచ్చు.అలాగే మీరు పియఫ్ ట్రాన్స్ఫర్ లేదా మిగతా సర్వీస్ ల కొరకు అయితే పియఫ్ కి సంబంధించి అధికారిక వెబ్సైటు ద్వారా మాత్రమే చేసుకోడానికి అవుతుంది.

Note Points:

  1. మొదటి సారి మీరు ఎధైన పియఫ్ ఇచ్చే కంపెనీ లో జాయిన్ అయినట్లయితే మీకు పియఫ్ నెంబర్ అనేది కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది.అది మీరు ఆక్టివేట్ చేసుకోవాల్సి వుంటుంది.

  2. పియఫ్ ఆక్టివేట్ ప్రాసెస్ ఇందులోనే Umang యాప్ లోనే చేసుకోవాలి.గతంలో అయితే పియఫ్ వెబ్సైటు లో కూడా చేసుకోడానికి వచ్చేది.ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు.

  3. పియఫ్ ఆక్టివేట్ చేసుకున్నాక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి.

  4. పియఫ్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఉంటేనే లాగ్ ఇన్ కావడానికి వస్తుంది ఆ తర్వాత పియఫ్ ప్రాసెస్ చేసుకోవచ్చు.

  5. అలాగే ముఖ్యంగా పియఫ్ క్లెయిమ్ చేసుకోవాలి అంటే మన పియఫ్ కి బ్యాంకు ఎకౌంటు,పాన్ కార్డు లింక్ అయ్యి వుండాలి.

  6. బ్యాంకు ఎకౌంటు మరియు పాన్ కార్డు లింక్ చేసుకోవాలి అంటే పియఫ్ అధికారిక వెబ్సైటు లోనే చేసుకోవాలి.

  7. అలాగే ముందు గానే మీ పియఫ్ Uan నెంబర్ వుండి ఇంకో వేరే కంపెనీ లో జాయిన్ అయిన కూడా ఆ కంపెనీ మెంబెర్ ఐడి ఓల్డ్ UAN లోనే యాడ్ చెయ్యడం జరుగుతుంది.

  8. ఫారం-31 క్లెయిమ్ ఒక వారం లోపు సెటిల్ అవుతుంది.

  9. అలాగే ఫారం -19 కింద ఫుల్ క్లెయిమ్ చేస్తే 15 రోజులలోపు సెటిల్ అవుతుంది.

పియఫ్ క్లెయిమ్ నియమాలు:

  1. మీరు ప్రస్తుతం వర్క్ చేస్తునట్లు అయితే మీ పియఫ్ బాలన్స్ లో కేవలం Form-31 ద్వారా మీ ఉద్యోగి యొక్క షేర్ మాత్రమే క్లెయిమ్ చేసుకోడానికి కుదురుతుంది.

  2. అలాగే మీరు రాజీనామా చేసి 2 నెలలు కంప్లీట్ అయ్యాక పూర్తి పియఫ్ బాలన్స్ అమౌంట్ క్లెయిమ్ చేసుకోడానికి అవుతుంది.

  3. మీరు పూర్తి పియఫ్ పెన్షన్ తో పాటు తీసుకోవాలి అంటే ఫారం -19 అలాగే ఫారం-10c ద్వారా క్లెయిమ్ చేసుకోవాల్సి వుంటుంది.

  4. ఒకవేళ మీరు ఒక కంపెనీ లో వర్క్ చేసి అందులో మనీ క్లెయిమ్ చేసుకోకుండానే వేరే కంపెనీ లో జాయిన్ అయ్యి మెంబెర్ ఐడి పియఫ్ లో యాడ్ అయింటే,

  5. ఓల్డ్ కంపెనీ మనీ తీస్కోవాలి అంటే ఆ డబ్బులు ప్రస్తుత కంపెనీ లోకి యాడ్ చేసి క్లెయిమ్ చెయ్యాలి.

  6. మీరు రాజీనామా చేసి పూర్తి పియఫ్ తీస్కునే డబ్బులు 50 వేల కంటే ఎక్కువ వుంటే టాక్స్ కట్ అవ్వకుండా పూర్తి అమౌంట్ రావాలి అంటే తప్పకుండా క్లెయిమ్ సమయం లో ఫారం-15g ఫిల్ చేసి సంతకం చేసి ఆ ఫారంను ఫారం-19 క్లెయిమ్ సమయంలో అప్లోడ్ చేసి చెయ్యాలి.

  7. వుద్యోగి షేర్ కొరకు ఫారం-31 ఆప్షన్ లో చేసుకోండి.

  8. రాజీనామా చేసి వుంటే ఉద్యోగి షేర్ మరియు కంపెనీ షేర్ ఫారం-19 ఆప్షన్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు.

  9. అలాగే పియఫ్ లో పెన్షన్ కూడా వుంటే ఫారం-10c చేసుకోండి.

UMANG యాప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్:

  1. ముందుగా ప్లే స్టోర్ లో UMANG యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోండి (యాప్ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి)

  2. యాప్ ఓపెన్ చేశాక అందులో పైన కుడి వైపు మెనూ ఆప్షన్ వుంటుంది క్లిక్ చెయ్యండి.అక్కడ GET STARTED ఆప్షన్ క్లిక్ చెయ్యండి.

  3. ఆ తర్వాత మరొక పేజి ఓపెన్ అవుతుంది.అందులో DIGILOCKER ద్వారా లాగ్ ఇన్ అవ్వమని చూపిస్తుంది.

  4. అందులో మీ మొబైల్ నెంబర్ మరియు పిన్ ద్వారా లాగ్ ఇన్ అవ్వాలి.ఒకవేళ కొత్త user అయితే sign up ఆప్షన్ క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి sign in అవ్వాలి.

  5. ఆ తర్వాత సెర్చ్ ఆప్షన్ లోకి వెళ్లి EPFO అని క్లిక్ చెయ్యండి.సర్వీస్ చూపిస్తుంది క్లిక్ చెయ్యండి.

  6. అక్కడ మీ UAN నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చెయ్యండి.ఇలా మీరు EPFO సర్వీస్ లోకి ఎంటర్ అవుతారు.

వర్కింగ్ లో వుండి ఉద్యోగి షేర్ ఫారం-31 క్లెయిమ్ ఎలా చెయ్యాలి?

  1.  UMANG యాప్ లో పియఫ్ సర్వీసెస్ లో RAISE CLAIM ఆప్షన్ వుంటుంది క్లిక్ చెయ్యండి.

  2. ఆ తర్వాత పేజిలో ఫారం-31 ఆప్షన్ క్లిక్ చేసుకోండి.

  3. ఆ తర్వాత మీ ఎకౌంటు నెంబర్ ఎంటర్ చేయమని చూపిస్తుంది క్లిక్ చెయ్యండి.

  4. ఆ తర్వాత మీ కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఎంత క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటూన్నారో ఎంటర్ చేసుకోండి

  5. తదుపరి మీ ఆధార్ అడ్రస్ ను ఎంటర్ చేసుకోండి.

  6. ఆ తర్వాత ఆధర్ ఒటిపి ఆప్షన్ క్లిక్ చేసుకోండి.

  7. ఆధర్ కి లింక్ వున్నా మొబైల్ నెంబర్ కి ఒటిపి వస్తుంది ఆ ఒటిపి ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి.

  8. ఇలా మీరు ప్రాసెస్ చేస్తే క్లెయిమ్ రిక్వెస్ట్ కంప్లీట్ అవుతుంది.అయ్యాక ఒక 1 వారం లోపు క్లెయిమ్ సెటిల్ అయ్యి మనీ క్రెడిట్ అవుతుంది.

రాజీనామా చేసి వుండి పూర్తి డబ్బులు క్లెయిమ్ చెయ్యు ప్రాసెస్:

  1. పియఫ్ పూర్తి డబ్బులు తీస్కోవాలి అంటే రాజీనామా చేసి 2 నెలలు పూర్తి అవ్వాలి అలాగే కంపెనీ ఎగ్జిట్ డేట్ అయ్యి వుండాలి.

  2. UMANG యాప్ లో పియఫ్ సర్వీసెస్ ఓపెన్ చేసుకోండి.

  3. ఆ తర్వాత RAISE క్లెయిమ్ ఆప్షన్ లోకి వెళ్ళండి.అందులో ఫారం-19 ఆప్షన్ క్లిక్ చేసుకోండి.

  4. తదుపరి మీ ఎకౌంటు నెంబర్ ఎంటర్ చెయ్యండి.

  5. ఆ తర్వాత మీ పియఫ్ పూర్తి అమౌంట్ 50 వేల కంటే ఎక్కువ వుంటే ఫారం-15g అప్లోడ్ చెయ్యండి అక్కడ.

  6. ఆ తర్వాత ఆక్కడ ఆధార్ అడ్రస్ నమోదు చేసుకోండి.తర్వాత GET OTP ఆప్షన్ క్లిక్ చేసుకోండి.

  7. ఒటిపి ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కండి.ఆ తర్వాత సబ్మిట్ అయిన క్లెయిమ్ ఫారం ఓపెన్ అవుతుంది.

  8. ఇలా ప్రాసెస్ చేశాక 10 రోజుల లోపు క్లెయిమ్ సెటిల్ అవుతుంది.

  9. అలాగే మీ పియఫ్ లో పెన్షన్ డబ్బులు కూడా వుంటే ఆ డబ్బులు క్లెయిమ్ కొరకు ఇదే ప్రాసెస్ లో ఫారం-10c క్లిక్ చేసి ఇలాగే ప్రాసెస్ చెయ్యండి.

  10. ఒకవేళ మీకు పియఫ్ మాత్రమే వుండి పెన్షన్ డబ్బులు లేకపోతే ఫారం-10c అవసరం లేదు కేవలం ఫారం-19 ఒకటి క్లెయిమ్ సబ్మిట్ చెయ్యండి.

క్లెయిమ్ స్టేటస్ చెక్ చెయ్యడం ఎలా?

  1. ఉమంగ్ యాప్ లోనే క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవచ్చు

  2. UMANG యాప్ EPFO సర్వీసెస్ లో TRACK CLAIM ఆప్షన్ వుంటుంది క్లిక్ చెయ్యండి.

  3. అందులో మనకు క్లెయిమ్ సెటిల్ అయ్యిందా లేదా రిజెక్ట్ అయిందా అనేది చూపిస్తుంది.ఒకవేళ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయ్యిందో చూపిస్తుంది.

పియఫ్ పాస్ బుక్ బాలన్స్ ఎలా చూడాలి?

  • ఉమంగ్ లోనే పాస్ బుక్ ఆప్షన్ వుంటుంది క్లిక్ చేసి కంపెనీ మెంబెర్ ఐడి ప్రకారం ఉద్యోగి షేర్ మరియు కంపెనీ షేర్ ఎంత వుందో క్లియర్ గా చూపిస్తుంది.

  • అలాగే epfo అధికారిక వెబ్సైటు లో కూడా బాలన్స్ చెక్ చేసుకోవచ్చు.

కింది సర్వీసులు మాత్రం UMANG యాప్ ద్వారా చెయ్యలేరు.

  1. మనం కొన్ని సర్వీసులు మాత్రమే ఉమంగ్ యాప్ లో చెయ్యడానికి అవుతుంది.మిగతా సర్వీసులు వెబ్సైటు లోనే లాగ్ ఇన్ చేసుకోవాలి.

  2. మీ ఓల్డ్ కంపెనీ లో డబ్బులు ప్రస్తుత కంపెనీ లోకి ట్రాన్స్ఫర్ చెయ్యాలి అంటే వెబ్సైటు లోనే చెయ్యాలి.

  3. అలాగే మీ పియఫ్ డేటా మార్చాలి అంటే వెబ్సైటు లోనే ఆప్షన్ వుంటుంది.

  4. అదే విధంగా మీ పియఫ్ కి బ్యాంకు లింక్ అలాగే పాన్ లింక్ చెయ్యాలి అంటే ఉమంగ్ లో రాదు epfo వెబ్సైటు లోనే చెయ్యాలి.

  5. అలాగే కంపెనీ యొక్క ఎగ్జిట్ డేట్ అప్డేట్ చెయ్యాలి అంటే వెబ్సైటు లోనే చేసుకోవాలి.

గమనిక: పియఫ్ సంభందించి ఏవైనా సందేహాలు వుంటే కింద కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి.

 

READ ALSO:

Train Ticket Booking: కొత్త రైల్వే యాప్ వచ్చింది.ఇందులో 2 నిమిషాల్లోనే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు ll ఇలా చేసుకోండి..

 

 

AUTHOR:

Web |  + posts

Ram Naik is the founder and content creator of Rammeesevatelugu.com. He is a Passionate content creator with over 4 years of experience, specializing in creating impactful and high quality content. He is a expertise in digital marketing, web designing and SEO strategies. He writes daily about online services, jobs notifications, and government schemes information in telugu. With a strong focus on public needs information. His ambition is to all types of useful information easily available to every reader in telugu

Leave a Comment