Pm Awas Yojana scheme ll ఇంటి నిర్మాణానికి ౩ లక్షలు ఇస్తున్నారు ll వెంటనే ఇలా అప్లై చేసుకోండి ll అర్హతలివే

Pm Awas Yojana scheme:

  • ఈ పథకం లో భాగం గా ఇల్లు లేని నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం పియం ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు మంజూరు చేస్తున్నారు.ఈ పథకం ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు 2015 వ ఏడాదిలో ప్రారంబించడం జరిగింది.ఈ పథకం ను గ్రామీణ ప్రాంతాల్లో వారికి అలాగే పట్టణ ప్రాంతాల వారికి అయిన అర్హత వున్నా వారికి ఇస్తున్నారు.కావున ఈ పథకం యొక్క దరఖాస్తు ప్రక్రియ అలాగే అర్హతలు, కావలిసిన పత్రాలు మొదలగు ముఖ్య విషయాల గురించి కింద వివరంగా తెలుసుకుందాం.

Note Points:

  • ఇందులో మెయిన్ గా రెండు రకాల పథకాలు వున్నాయి అవి ఒకటి గ్రామాల వారికి రూరల్ గృహ పథకం అలాగే సిటీ వారికి అర్బన్ గృహ పథకం.

  •  మనం ఈ పథకానికి ఈ ఆవాస్ యోజన యొక్క అధికారిక వెబ్సైటు ద్వారా అప్లై చెయ్యొచ్చు లేదా ఆఫ్ లైన్ లో హౌసింగ్ డిపార్టుమెంటు వారి దగ్గర అప్లై చేసుకోవచ్చు.

  •  రేషన్ కార్డు వున్నా కుటుంబం లో ఒకరికి మాత్రమే ఇది వర్తిస్తుంది.

  • పెళ్లి అయ్యి సొంత ఇల్లు లేకుండా ఖాళి స్తలం వున్నావారు అర్హులు.

  • మీకంటూ సొంత ఇల్లు లేకున్నా మీ పేరు మిద ఇంటి పన్ను లేదా కరెంటు మీటర్ వుంది అంటే మీకు ఇల్లు వుంది అనే కింద ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి మీరు అర్హత పొందలేరు.

  • మీ ఏరియా లో ఈ పథకం ఎలిజాబుల్ వుందో లేదో మీ దగ్గరలో వుండే ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా సచివాలయం లో లేదా హౌసింగ్ డిపార్టుమెంటు వారిని అడగండి అప్లై చేసుకోండి..

ఉండాల్సిన అర్హతలు:

  1. భారత దేశ పౌరులు మాత్రమే అర్హులు.

  2. ఇండియాలో ఎక్కడ కూడా సొంత ఇల్లు ఉండకుడదు.

  3. ఆర్ధికంగా వెనుకబడిన వారికే ఈ పథకం కింద ఇల్లు మంజూరు చేస్తారు.

  4. తెల్ల రేషన్ కార్డు కలిగి వుండాలి.

  5. వయసు పరిమితి అయితే లేదు.

  6. అర్బన్ ఆవాస్ యోజన స్కీం కి కింది విధంగా ఇన్కమ్ పరిమితిని బట్టి ఇల్లు మంజూరు చేస్తారు.

  7. ఇందులో EWS (ఆర్థికంగా బలహీన వర్గాలు) వార్షిక ఆదాయం ౩ లక్షల లోపే వుండాలి.

  8. అలాగే LIG(తక్కువ ఆదాయ వర్గాలు) వార్షిక ఆదాయం ౩ లక్షల నుంచి 6 లక్షల వరకు అర్హులు.

  9. అదే విధంగా MIG (మధ్య ఆదాయ వర్గం) 6 లక్షల నుంచి 12 లక్షల లోపే వుండాలి.

  10. అలాగే గ్రామిన ఆవాస్ యోజన అయితే గ్రామాల్లో వుండే షెడ్యూల్ కులాలు/తెగల వారికి,భూమి లేని వారికి ప్రాధాన్యత వుంటుంది.

అప్లై కొరకు ఉండాల్సిన పత్రాలు:

  1. దరఖాస్తుదారులకు ఇండియాలో ఎక్కడ కూడా సొంత ఇల్లు వారి పేరు మిద ఉండకుడదు.

  2. దరఖాస్తుదారు గుర్తింపు యొక్క ఆధార్ కార్డు కలిగి వుండాలి.

  3. అలాగే ఆవాస్ యోజన యొక్క అప్లికేషను ఫార్మ్ వుండాలి.

  4. పాస్పోర్ట్ సైజు ఫొటోస్ వుండాలి.

  5. తెల్ల రేషన్ కార్డు వుండాలి.

  6. సొంత స్తలం వుండాలి.ఇల్లు కాకుండా

  7. దరఖాస్తుదారు యొక్క ఇన్కమ్ మరియు కుల ద్రువికరణ పత్రాలు వుండాలి.

  8. అలాగే ముఖ్యంగా బ్యాంకు పాస్ బుక్ కలిగి వుండాలి.

  9. Mgnrega బుక్ వుండాలి.

  10. ఇంకా అవసరమైన అన్ని డాకుమెంట్స్ సిద్దంగా ఉంచుకోండి.

ఎవరు అర్హులు కాదు?

  • ఇండియా లో సొంత ఇల్లు వుంటే ఈ పథకం వర్తించదు.

  • గవర్నమెంట్ జాబు లేదా ఇన్కమ్ టాక్స్ పే చేసే వారు అనర్హులు.

  • వార్షిక ఆదాయం 12 లక్షల కంటే ఎక్కువ వున్నా వారు అనర్హులు.

ఆవాస్ యోజన పథకం అప్లై ప్రాసెస్:

  1. ముందుగా పియం ఆవాస్ యోజన అధికారిక వెబ్సైటు అయిన PMAY సైట్ ఓపెన్ చేసుకోండి(వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి)

  2. వెబ్సైటు ఓపెన్ చేశాక అందులో Pm Awas Yojana apply ఆప్షన్ క్లిక్ చేసుకోండి.

  3. ఆ తర్వాత మరొక పేజి ఓపెన్ అవుతుంది.అందులో సిటిజెన్ అస్సిస్మెంట్ ఆప్షన్ క్లిక్ చెయ్యండి.

  4. తదుపరి పేజిలో మీ యొక్క గుర్తింపు కార్డు అంటే ఆధార్ కార్డు వివరాలు బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చెయ్యండి.

  5. ఆ తర్వాత మరొక పేజిలో ఆన్లైన్ అప్లికేషను చూపిస్తుంది.అందులో చూపించే ప్రతి ఆప్షన్ పూర్తిగా జాగ్రతగా నమోదు చేసుకోండి.

  6. తదుపరి పేజిలో మీ యొక్క డాకుమెంట్స్ అక్కడ అప్లోడ్ చెయ్యండి.

  7. ఇలా అప్లికేషను మొత్తం పురించక సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి.ఆ తర్వాత మీరు అప్లై చేసిన ఫారం చూపిస్తుంది.సేవ్ చేసుకొండి.

  8. అప్లై చేశాక మీ దరఖాస్తు స్టేటస్ ఆన్లైన్ లోనే చెక్ చేసుకోవచ్చు.

  9. మీరు అప్లై చేసిన అప్లికేషన్ హౌసింగ్ యొక్క ఉన్నతాధికారులకు చేరుతుంది.

  10. ఆ తర్వాత మీరు అర్హుల లేదా అనేది పూర్తిగా పరిశిలించి ఇల్లు మంజూరు చేస్తారు తర్వాత మీకు ఇంటి అమౌంట్ వస్తుంది.

  11. ఇలా మీరు ప్రాసెస్ పూర్తి చేసుకోండి.

గమనిక: ఈ పథకం సంబంధించి ఇంకా ఏవైనా సందేహాలు వుంటే కింద కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి.

Read Also;

ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం ll రూ.6000/- రైతుల ఖాతాల్లో జమ..ఇలా అప్లై చేసుకోండి ll ఉండాల్సిన అర్హతలు ఇవే..

 

 

Author:

Web |  + posts

Ram Naik is the founder and content creator of Rammeesevatelugu.com. He is a Passionate content creator with over 4 years of experience, specializing in creating impactful and high quality content. He is a expertise in digital marketing, web designing and SEO strategies. He writes daily about online services, jobs notifications, and government schemes information in telugu. With a strong focus on public needs information. His ambition is to all types of useful information easily available to every reader in telugu

Leave a Comment