ఆధార్ కొత్త ఆప్షన్ వచ్చేసింది? ఇక నుంచి ఇంట్లో కూర్చొని మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి..ఇలా

Aadhaar With Mobile Number Link Online:

  • ఆధార్ నుంచి కొత్త ఫీచర్ అయితే వచ్చేసింది ఈ ఆప్షన్ ద్వారా మన ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి అంటే ఆధార్ సెంటర్ కు పోవాల్సిన అవసరం లేకుండా మనమే సొంతం గా ఆధార్ కి సెల్ నెంబర్ లింక్ చేస్కోవచ్చు.ఇందుకు సంబదించి ఆధార్ కి సంబదించిన  UIDAI సంస్థ వారు ఆధార్ సంబంధించి ఒక కొత్త యాప్ లాంచ్ చేయడం జరిగింది.ఈ యాప్ ద్వారా మన మొబైల్ లోనే ఈ ప్రాసెస్ చాలా సులభంగా రెండు నిమిషాల్లోనే మన ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ చేస్కోవచ్చు లేదా మొబైల్ నెంబర్ ని మర్చ్చుకోవచ్చు.అది ఎలా ప్రాసెస్ చెయ్యాలో కింద వివరంగా తెలియజేయడం జరిగింది.చూసి చేసుకోండి.

Note Points:

  • ఈ ఫీచర్ లో ప్రాసెస్ చెయ్యాలి అంటే ముందే ఆధర్ కి సెల్ నెంబర్ లింక్ అయ్యి వుండాలి.ఎందుకంటే ఆధార్ యాప్ లో ఆధార్ ద్వారా లాగ్ ఇన్ అయ్యి ఈ ప్రాసెస్ చేస్కోవాలి.

  • మీ ఆధర్ కార్డు కి ఇప్పటి వరకు మొబైల్ నెంబర్ లింక్ లేకుండా వుండి కొత్తగా చేస్కోవాలి అంటే ఈ ఆప్షన్ లో చేస్కోలేము ఆధార్ సెంటర్ కి పోయి చేస్కోవాలి.

ఇందు కొరకు కావలిసిన డీటెయిల్స్ ఏంటి?

  • ఈ ప్రాసెస్ చెయ్యాలి అంటే కేవలం ఆధర్ వుండి దానికి లింక్ అయిన నెంబర్ వుంటే చాలు చేస్కోవచ్చు.అలాగే స్మార్ట్ ఫోన్ వుండాలి.

ఆన్లైన్ ఫీజు ఉంటుందా?

  • యాప్ లో మనం ప్రాసెస్ టైం లో 75RS ఫీజు ఆన్లైన్ లో పే చెయ్యాలి.

  • మీరు ఆఫ్ లైన్ లో ఆధర్ సెంటర్ లో చేసుకున్న ఫీజు అనేది వుంటుంది.

ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ చేయు పూర్తి ప్రాసెస్:

  1. ముందుగా మీ మొబైల్ ఓపెన్ చేసి ప్లే స్టోర్ లో ఆధార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి (యాప్ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి)

  2. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసుకోండి.ఆక్కడ మీకు Allow చెయ్యమని చూపిస్తుంది చెయ్యండి.

  3. ఆ తర్వాత ఆక్కడ “Skip This Introduction Do Register’ ఆప్షన్ క్లిక్ చెయ్యండి.

  4. తదుపరి పేజిలో “Im Ready With My Aadhar’ ఆప్షన్ క్లిక్ చెయ్యండి.

  5. ఆ తర్వాత పేజిలో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి.తర్వాత కింద కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చెయ్యండి.

  6. తదుపరి ఆధార్ Consent బాక్స్ టిక్ చేసి Proceed ఆప్షన్ క్లిక్ చెయ్యండి.

  7. ఆ తర్వాత పేజిలో మీ మొబైల్ లో వున్నా సిమ్ ఆప్షన్ చూపిస్తుంది కింద ‘Send Sms’ ఆప్షన్ వుంటుంది క్లిక్ చెయ్యండి.

  8. (Note: మీ ఆధార్ కి లింక్ వున్నా మొబైల్ నెంబర్ ఏ మొబైల్ లో ఉంటుందో అందులోనే ఈ ప్రాసెస్ చెయ్యడానికి అవుతుంది)

  9. ఆ తర్వాత ఒటిపి వెరిఫికేషన్ ప్రాసెస్ అవుతుంది.అది అయ్యాక “Continue To Face Authentication’ వుంటుంది ఆ ఆప్షన్ క్లిక్ చెయ్యండి.

  10. ఆ తర్వాత పేజిలో మీ పేస్ క్యాప్చర్ పూర్తి చెయ్యండి.ఈ ప్రాసెస్ అయ్యాక proceed ఆప్షన్ చూపిస్తుంది క్లిక్ చెయ్యండి.

  11. తదుపరి పేజిలో ఆరు అంకెల పిన్ నెంబర్ సెట్ చేసుకోండి.కంటిన్యూ పిన్ ఆప్షన్ క్లిక్ చెయ్యండి.

  12. ఇలా ప్రాసెస్ మీ ఆధార్ యొక్క పూర్తి లాగ్ ఇన్ ఓపెన్ అవుతుంది.

  13. ఆక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఆ యాప్ లోనే కిందికి స్క్రోల్ చేస్తే సర్వీసెస్ ఆప్షన్ చూపిస్తుంది అందులో వుండే My Aadhaar Update ఆప్షన్ క్లిక్ చెయ్యండి.

  14. తదుపరి పేజిలో మన ఆధార్ కి సంబదించి సర్వీసులు చూపిస్తాయి అందులో మొదటి ఆప్షన్ మొబైల్ నెంబర్ అప్డేట్ క్లిక్ చేసుకోండి.

  15. ఆ తర్వాత పేజిలో ప్రాసెసింగ్ సమయం మరియు ప్రాసెస్ ఫీజు చూపిస్తుంది.

  16. ఇక్కడ నుంచి మొత్తం నాలుగు స్టెప్స్ వుంటాయి.(కొత్త మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ మరియు పేస్ క్యాప్చర్ అలాగే పేమెంట్ ఆప్షన్ ఇలా స్టెప్స్ వుంటాయి)

  17. కింద కంటిన్యూ ఆప్షన్ వుంటుంది క్లిక్ చెయ్యండి.

  18. ఆ తర్వాత పేజిలో మీ ఆధార్ కి ప్రస్తుతం లింకయ్యి వున్నా నెంబర్ అలాగే కింద మనం మార్చుకోవాలి అనుకుంటున్నా నెంబర్ ఎంటర్ చెయ్యండి.కింద సెండ్ ఒటిపి ఆప్షన్ క్లిక్ చేసుకోండి.

  19. నెక్స్ట్ ఒటిపి వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత పేస్ క్యాప్చర్ చేసి అమౌంట్ 75Rs పేమెంట్ మీ ఫోన్ పే ద్వారా కంప్లీట్ చేసుకోండి.

  20. ఇలా మీరు ప్రాసెస్ పూర్తి చేశాక మీకు ఒక రెసిప్ట్ చూపిస్తుంది.అందులో SRN అనే నెంబర్ వుంటుంది.దాన్ని సేవ్ చేసుకోండి.

  21. మీరు చేసిన ప్రాసెస్ అయ్యిందో లేదో స్టేటస్ ఎక్కడి వరకు వచ్చింది అనేది అందులోనే యాప్ లో నే మనం చుస్కోవచ్చు.

ఆఫ్ లైన్ ద్వారా ఆధార్ కి మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలి?

  • మన ఆధార్ కార్డు కు అంతకు ముందే మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే పైన చెప్పిన ప్రాసెస్ లో చేస్కోలేము.కావున మీరు ఆఫ్ లైన్ లోనే నేరుగా మీ ధగర్లో వుండే ఆధార్ సెంటర్ లోనే లింక్ చేసుకోవాలి.

  • మీ ఆధర్ కార్డు మరియు మొబైల్ నెంబర్ తీస్కొని ఆధార్ సెంటర్ లోనే చేసుకోండి.రెండు రోజులోనే లింక్ అవుతుంది.

ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ వుందా లేదా అనేది ఎలా చూడాలి?

  1. ముందుగా UIDAI యొక్క అధికారిక వెబ్సైటు ఓపెన్ చేసుకోండి.(వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి)

  2. వెబ్సైటు ఓపెన్ చేశాక అందులో ఆధార్ సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి.

  3. ఆ తర్వాత పేజిలో ఆధార్ యొక్క అన్ని సర్వీసెస్ ఆప్షన్స్ చూపిస్తాయి అందులో “Verify Aadhaar Number’ ఆప్షన్ వుంటుంది క్లిక్ చెయ్యండి.

  4. తదుపరి పేజిలో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యండి.

  5. ఆ తర్వాత పేజిలో మీకు మీ ఆధార్ యొక్క స్టేట్ మరియు ఆధార్ కి ఏ నెంబర్ లింక్ వుందో అది లాస్ట్ మూడు నంబర్స్ చూపిస్తుంది.ఇలా చెక్ చేసుకోవచ్చు.

 

గమనిక:

ఈ ప్రాసెస్ కి సంబంధించి ఏవైనా సందేహాలు వుంటే కింద కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి.

 

READ ALSO:

అన్నదాత సుఖీభవ స్కీం ll ప్రతి రైతుకు 20,000/-రూ ఖాతాల్లో జమ ll అర్హతలు ఏంటి ll వెంటనే ఇలా అప్లై చేసుకోండి..

 

Web |  + posts

Ram Naik is the founder and content creator of Rammeesevatelugu.com. He is a Passionate content creator with over 4 years of experience, specializing in creating impactful and high quality content. He is a expertise in digital marketing, web designing and SEO strategies. He writes daily about online services, jobs notifications, and government schemes information in telugu. With a strong focus on public needs information. His ambition is to all types of useful information easily available to every reader in telugu

Leave a Comment