అన్నదాత సుఖీభవ స్కీం ll ప్రతి రైతుకు 20,000/-రూ ఖాతాల్లో జమ ll అర్హతలు ఏంటి ll వెంటనే ఇలా అప్లై చేసుకోండి..

అన్నదాత సుఖీభవ పథకం:

  • ఏపి ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద అర్హత కలిగిన రైతులకు ఏడాదికి 20000/- రూ ఇచ్చే వుదేశంతో అన్నదాత సుఖీభవ అనే పథకంను గత ఏడాది 2025వ ఏడాదిలో ఈ పథకంను ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారు ప్రారంబించడం జరిగింది.ఇందులో బాగంగా ఈ పథకం కింద ఏడాదికి మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు.ఈ పథకం కింద చిన్న, సన్న కారు రైతులు అలాగే కౌలు రైతులు లబ్ది పొందుతూ వస్తున్నారు.ఈ పథకానికి కేంద్రం నుంచి వచ్చే పియం కిసాన్ 6000 రూపాయలు అలాగే ఏపి ప్రభుత్వం కోటా కింద 14000 రూపాయలను ఇలా మొత్తంగా రైతుల ఖాతాల్లో క్రెడిట్ చేస్తున్నారు. ఇందుకు గాను ఈ పథకానికి అర్హతలు ఏంటి ఎలా అప్లై చేస్కోవాలి,పేమెంట్ స్టేటస్ ఎలా చుస్కోవాలి అలాగే ఈ పథకానికి కావలిసిన పత్రాలు ఏంటి అనే పూర్తి వివరాలు కింద వివరంగా తెలియజేయడం జరిగింది.

అన్నదాత సుఖీభవ పథకానికి ఉండాల్సిన అర్హతలు:

  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబందించిన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

  • చిన్న సన్న కారు రైతులు అంటే 5 ఎకరాల లోపు పొలం వున్నావారు ఈ పథకానికి అర్హులు.

  • లబ్దిదారు వయసు 18 ఏళ్ళు నిండి వుండాలి

  • అలాగే లబ్దిదారు తెల్ల రేషన్ కార్డు కలిగి వుండాలి.

  • అదే విధంగా మీ భూమికి సంబందించిన సరైన పత్రాలు వుండాలి.

  • మీ పొలం ఆన్లైన్ నమోదు అయ్యి వుండి డిజిటల్ గా సంతకం అయ్యి వుండాలి.అలాగే పంట కూడా ఆన్లైన్ లో నమోదు అవ్వాలి.

  • మీ పొలానికి సర్వే నెంబర్ డిజిటల్ గా వెరిఫై అయ్యి వుండాలి.

  • మీరు కౌలు రైతులు అయితే తప్పనిసారిగా కౌలు రైతు ద్రువికరణ పత్రం వుండాలి.

  • అలాగే రైతు యొక్క పొలానికి ఆధర్ లింక్ అయ్యి వుండాలి.

  • మీరు కేంద్ర ప్రభుత్వ పథకం పియం కిసాన్ పథకానికి అర్హులు అయితే ఈ పథకానికి కూడా అర్హత పొందినట్లే.

  • ఒక కుటుంబం లో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

  • ఉదాహరణకు ఒక కుటుంబంలో ముగురి పేరు మిద పొలం వుంటే అందులో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

ఈ పథకం యొక్క ఉపయోగాలు:

  1. రైతులకు పంట వేసుకునే సమయంలో పెట్టుబడి కొరకు ఆర్థికంగా బరోస కల్పించడం.

  2. ఈ పథకం లో అర్హులైనా రైతులకు ఏడాదికి మూడు విడతలలో అంటే మూడు సీజన్లో లలో ఈ పథకం అమౌంట్ ఇస్తున్నారు.

  3. ముఖ్యంగా రైతులు ఆర్థిక సమస్యలు లేకుండా వ్యవసాయం చేసుకోవడం ఈ పథకం యొక్క ముఖ్య వుదేశం.

  4. అలాగే రైతులకు ఈ పథకం లో బాగంగా ఎరువులు,విత్తనాలు, విపతులకు సంబదించి భరోసా కల్పిస్తారు.

  5. ఈ పథకం లో కేంద్రం నుంచి ఇచ్చే పియం కిసాన్ ఏడాది సాయం 6000 రూపాయలు కలుపుకొని 20000 రూపాయలు ఇస్తారు.అంటే ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 14000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.మిగతా అమౌంట్ మీరు పియం కిసాన్ కి అప్లై చేసుకొని వుండి అర్హుల జాబితాలో పేరు వున్నా వారికి వస్తాయి.

ఈ పథకానికి కావలిసిన పత్రాలు:

  • అన్నదాత సుఖీభవ సంబంధించి అప్లికేషను ఫారం వుండాలి.

  • లబ్ది దారు యొక్క ఆధర్ తప్పని సారిగా వుండాలి అలాగే ఆధార్ లింక్ నెంబర్ కలిగి వుండాలి.

  • అలాగే తప్పనిసరిగా రేషన్ కార్డు వుండాలి.

  • అదే విధంగా రైతు పొలానికి సంబంధించి పట్టా దారు పాస్ పుస్తకం వుండాలి.

  • అలాగే రైతు యొక్క బ్యాంకు పాస్ బుక్ వుండాలి.

  • అలాగే రైతు యొక్క పాస్ పోర్ట్ సైజు ఫోటో వుండాలి.

  • అదే విధంగా మన బ్యాంకు ఎకౌంటు కి ఆధార్ లింక్ అయ్యి వుండాలి.

  • అలాగే రైతుకు సంబoదించి కుల ద్రువికరణ పత్రం అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ వుండాలి.

ఈ పథకానికి ఎవరికి అర్హత లేదు ?

  • కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి ఈ పథకం వర్తించదు.

  • అలాగే గవర్నమెంట్ పెన్షన్ పొందుతున్న వారు అర్హులు కాదు.

  • అదే విధంగా ఇన్కమ్ టాక్స్ కడుతున్న వారు అర్హులు కాదు.

  • అలాగే రాష్ట్రానికి చెందిన ప్రజా ప్రతినిధులకు ఈ పథకం వర్తించదు.

  • ముఖ్యంగా రేషన్ కార్డు లేకపోతే మీరూ  ఈ పథకానికి ఎలిజబుల్ అవ్వరు.

అన్నదాత పథకానికి అప్లై చేయు పూర్తి ప్రాసెస్:

  1. ఈ పథకానికి అర్హులైనా రైతులు వారి యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ అలాగే భూమి యొక్క పట్టా దారు పాస్ బుక్ వీటితో పాటు అన్న దాత సుఖీభవ అప్లికేషను ఫార్మ్ తో మీకు ధగర్లో వుండే రైతు సేవ కేంద్రాలకు వెళ్లి అగ్రికల్చర్ అసిస్టెంట్ ని సంప్రదించి అప్లై చేసుకోండి. వారు ఆన్లైన్ లో అప్లై చేస్తారు. ఈ పథకానికి మనమే సొంతం గా అప్లై చెయ్యడానికి అయితే లేదు.

  2. ఈ పథకానికి సంబదించి అధికారిక వెబ్సైటు అయితే అందుబాటులో వుంది కాని అందులో మనం కేవలం ఈ పథకం పేమెంట్ స్టేటస్ మాత్రం చూడగలం.

  3. మీరు అప్లై చేశాక మీ అప్లికేషన్ ను వ్యవసాయ అధికారులు పరిశిలించి మీ పేరును లబ్దిదారుల జాబితాలో చేర్చడం జరుగుతుంది.

  4. ఆ తర్వాత ఈ పథకం విడుదల సమయం లో  డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద రైతు యొక్క ఆధర్ లింక్ అయిన బ్యాంకు ఎకౌంటు కి నేరుగా డబ్బులు క్రెడిట్ చేయడం జరుగుతుంది.

ఈ పథకానికి ఎంపిక విధానం:

  1. ముందుగా మీరు రైతు సేవ కేంద్రాల్లో  నమోదు చేసుకున్న అప్లికేషన్ మీ మండల వ్యవసాయ అధికారులు యొక్క లాగ్ ఇన్ లకు వెళ్తుంది. వారు అప్లికేషను లను పరిశిలిస్తారు.

  2. ఆ తర్వాత మీరు వెబ్ ల్యాండ్ లో నమోదు చేసుకున్న భూమి యొక్క పూర్తి వివరాలను పరిశిలిస్తారు.రైతు పేరు, భూమి విస్తీర్ణం అలాగే సర్వే నంబర్స్ పరిశిలిస్తారు.

  3. అన్ని వివరాలు కరెక్ట్ గా వుంటే మీ అప్లికేషను ను జిల్లా వ్యవసాయ అధికారులకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.ఆ తర్వాత ఎలిజబుల్ లిస్టు లో మీ పేరు నమోదు చేస్తారు.

అన్నదాత సుఖీభవ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?

  1. అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ అలాగే పేమెంట్ వివరాలను ఈ పథకం యొక్క అధికారిక వెబ్సైటు లో చెక్ చేసుకోవచ్చు.

  2. ముందుగా అధికారిక వెబ్సైటు ఓపెన్ చేసుకోండి.(ఇక్కడ క్లిక్ చెయ్యండి)

  3. వెబ్సైటు ఓపెన్ అయ్యాక అక్కడ మనకు హోం పేజిలో “Know Your Status” ఆప్షన్ వుంటుంది దాన్ని క్లిక్ చెయ్యండి.

  4. తదుపరి పేజిలో రైతు యొక్క ఆధర్ నెంబర్ ఎంటర్ చేసి పక్కనే కాప్త్చ ఎంటర్ చేసి Search క్లిక్ చేస్తే రైతు యొక్క వివరాలు చూపిస్తాయి.అందులో రైతు పేరు అలాగే పంట వివరాలు అలాగే పేమెంట్ స్టేటస్ సమాచారం చూపిస్తుంది.

గమనిక:

ఈ పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ప్రశ్నలు వుంటే కింద కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి.

Read Also:

ముద్ర లోన్: 50 వేల నుంచి 10 లక్షల వరకు బ్యాంకు రుణాలు..వెంటనే అప్లై చేసుకోండి.అర్హతలివే

 

 

Author:

 

Web |  + posts

Ram Naik is the founder and content creator of Rammeesevatelugu.com. He is a Passionate content creator with over 4 years of experience, specializing in creating impactful and high quality content. He is a expertise in digital marketing, web designing and SEO strategies. He writes daily about online services, jobs notifications, and government schemes information in telugu. With a strong focus on public needs information. His ambition is to all types of useful information easily available to every reader in telugu

Leave a Comment